గుంటూరు

రాజధాని నిర్మాణంలో స్థానికుల వాహనాలు పనికిరావా: ఆర్కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మార్చి 25: వెలగపూడి వద్ద తాత్కాలిక రాజధాని నిర్మాణానికి భూములను త్యాగం చేసిన రైతులకు చెందిన ట్రాక్టర్లు, ఇతర వాహనాలు నిర్మాణ పనులకు పనికిరావా అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. శుక్రవారం నాడిక్కడ తన కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ తాత్కాలిక రాజధాని నిర్మాణాన్ని పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి స్థానిక రైతులు, గ్రామస్తుల సాధక బాధకాలు తెలుసుకోలేదని ఆయన విమర్శించారు. కనీసం తాత్కాలిక రాజధాని నిర్మాణం చోటుచేసుకుంటున్న వెలగపూడి గ్రామకంఠం తేల్చరా అని ఆయన అన్నారు. గ్రామప్రజలను ముఖ్యమంత్రి కలిస్తే ఎక్కడ వారు తమ సమస్యలు చెబుతారోనని ముఖ్యమంత్రి తప్పించుకు పోయారని, రైతుల ట్రాక్టర్లు కూడా రాజధాని నిర్మాణంలోకి వాడక పోవడం దారుణమని ఆయన అన్నారు. భవన నిర్మాణ కార్మికులు మరణిస్తే కనీసం ఎక్స్‌గ్రేషియా ప్రకటించని ముఖ్యమంత్రి మృతునితో పాటు పనిచేసే కార్మికులను పలకరించకుండా వెనుదిరగడం ఎంతమాత్రం క్షంతవ్యం కాదన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతులనుంచి లాక్కున్న భూములపై మక్కువ తప్ప నిర్మాణంపై ఏమాత్రం మక్కువ లేదన్నారు. తాత్కాలిక రాజధాని నిర్మాణం పూర్తిచేసి అసలు రాజధాని నిర్మాణాన్ని విదేశీ సంస్థలకు కట్టబెట్టి తద్వారా కోట్ల రూపాయలు కొట్టేసే ఎత్తుగడలో ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారని ఆర్కే విమర్శించారు. ప్రజలు తిరగబడే రోజులు ఎంతోదూరంలో లేవని ఆర్కే ధ్వజమెత్తారు.

సైక్లోథాన్ ర్యాలీని జయప్రదం చేయండి
గుంటూరు (స్పోర్ట్స్), మార్చి 25: నేటి ఆధునిక కాలంలో పని ఒత్తిడి, సమయాభావం తదితర కారణాల వల్ల శారీరక శ్రమ తగ్గి సరైన వ్యాయామం అందక అనేక రకాలైన రోగాలకు లోనవుతున్నారని మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక ఎల్‌విఆర్ అండ్ సన్స్ క్లబ్ ఆవరణలో శుక్రవారం జిల్లాస్థాయి సైక్లోథాన్ ర్యాలీకి సంబంధించిన వివరాలను ఆయన విలేఖర్లకు అందజేశారు. సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జిల్లాస్థాయిలో మొదటిసారిగా సైక్లోథాన్ ర్యాలీని నిర్వహిస్తున్నామని, ఎక్కువ సంఖ్యలో యువత, పెద్దలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ ర్యాలీకి ఇప్పటివరకు దాదాపు 2 వేల పేర్లు నమోదయ్యాయని, ఆదివారం నాటికి దాదాపు 4 నుండి 5 వేల వరకు పేర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ర్యాలీలో పాల్గొనే వారందరికీ ప్రశంసాపత్రాలను అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలను ఆవిష్కరించారు. 27వ తేదీ ఉదయం 6 గంటలకు ఎల్‌విఆర్ అండ్ సన్స్‌క్లబ్ నుండి మహాసైక్లోథాన్ ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కందిమళ్ల నాగేశ్వరరావు, మ న్నవ సుబ్బారావు, లాల్‌వజీర్, కోయ సుబ్బారావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.