Others
ఎందుకీ కుల జాడ్యం?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 1 October 2018
-- గుడిపల్లి విద్యావతి, 8886614346
కులమేంటి? కులమేంటి?
కులం లొసుగేంటి?
కులం గొప్పతనపు పొగరేంటి?
కులం.. కులం..
మనిషికీ మనిషికీ మధ్య
ఎందుకీ వ్యాకులం!
కులం వివక్షను గళంలో
గరళంలా నింపుకోక
ఎలుగెత్తి ఆక్షేపించు!
కులగజ్జి దురదాకు
ఒళ్ళంతా పూసుకుని
విషం రసితో సమాజాన్ని
విషతుల్యం చేసే
మానసిక చెండాలులకు
సరైన బుద్ధి చెప్పు
ఏమాత్రం ఉపేక్షింపక!
గబ్బిలంలా...
నీ వ్యక్తిత్వపు రెక్కలను
స్వేచ్ఛగా విప్పార్చి
వివక్షపు పసరిక కళ్ళు
గుచ్చి గుచ్చి కుళ్ళబొడుచు
తరతరాలుగా అణగద్రొక్కే
అహంకారపు సమాజ సంస్కృతిని
నిగ్గదీసి నిలదీసి అడుగు...
పట్టుదలతో నడుం బిగించు
చదువు సంధ్యల్లో రాణించు
సంఘంలో నీకంటూ ఒక స్థానం సంపాదించు
చట్టసభల్లో నినదించు
అంబేద్కర్ ఆశించిన
సమసమాజం సాధించు!