బిజినెస్

శిలాజేతర ఇంధన వనరులకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: భారత్ 2030 నాటికి ఉత్పత్తి చేసే మొత్తం విద్యుత్తులో 40 శాతాన్ని శిలాజేతర ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిలో వాతావరణ కాలుష్యాన్ని సృష్టించే బొగ్గుకు బదులు సౌర, పవన శక్తులను విస్తారంగా ఉపయోగించుకోవడానికి భారత్ కృషి చేస్తున్న నేపథ్యంలో మోదీ ఈ విషయం చెప్పారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్‌ఏ) తొలి సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ ప్రపంచ విద్యుత్ అవసరాలను తీర్చడానికి భవిష్యత్తు ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ)గా 121 దేశాలతో కూడిన ఐఎస్‌ఏ ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ ఇంధన అవసరాలను గత కొన్ని దశాబ్దాలుగా తీరుస్తున్న చమురు బావుల పాత్రను ఇక మీదట సౌరశక్తి నిర్వహిస్తుందని ఆయన అన్నారు. మానవులు తమ ఇంధన అవసరాల కోసం గత 150-200 సంవత్సరాల నుంచి భూగర్భంలో ఉన్న వనరులపై ఆధారపడుతూ వస్తున్నారని ఆయన అన్నారు. అయితే, భద్రమయిన భవిష్యత్తు కోసం భూమికి పైన ఉన్న సౌరశక్తి, పవనశక్తి వంటి వనరులను ఉపయోగించుకోవలసిన అవసరం ఎంతయినా ఉందని ఆయన నొక్కి చెప్పారు.