బిజినెస్

వృద్ధిబాట పట్టేస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, అక్టోబర్ 2: నీరవ్ మోదీ చేసిన భారీ మోసంతో నష్టాల పాలయిన ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తిరిగి గాడిన పడుతుందా? అవుననే అంటున్నారు ఆ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) సునిల్ మెహతా. పీఎన్‌బీ ఈ ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాలను ఆర్జిస్తుందని, వృద్ధి సాధించడానికి తగిన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. నీరవ్ మోదీ పాల్పడిన రూ. 14వేల కోట్ల కుంభకోణం గతించిన అంశమని ఆయన అన్నారు. నీరవ్ మోదీ చేసిన మోసం ఈ సంవత్సరం జనవరిలో వెలుగులోకి వచ్చిన తరువాత బ్యాంకు తీసుకున్న వివిధ చర్యల కారణంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే తిరిగి గాడిన పడుతుంది అని మెహతా అన్నారు. కేరళ వరద బాధితుల సహాయార్థం పీఎన్‌బీ తరపున మెహతా రూ. అయిదు కోట్ల సహాయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సోమవారం అందజేశారు. అనంతరం ఆయన ఒక వార్తాసంస్థ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలాంటి షాక్‌ను తట్టుకునే తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ సంవత్సరంలోనే అది తిరిగి గాడిన పడుతుంది’ అని పేర్కొన్నారు. పీఎన్‌బీ నెమ్మదిగా వృద్ధి పథంలోకి చేరుకుంటోందని ఆయన తెలిపారు. బ్యాంకు క్రెడిట్ గ్రోత్ పరిశ్రమ సగటును అధిగమించిందని ఆయన వివరించారు. 2017-18 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ. 343.40 కోట్ల లాభం ఆర్జించిన పీఎన్‌బీ నీరవ్ మోదీ పాల్పడిన కుంభకోణం కారణంగా 2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ. 940 కోట్లు నష్టపోయింది. ఈ బ్యాంకు విస్తరణ కోసం ఇప్పటికే దాని బోర్డు ప్రభుత్వానికి రూ. 5,431 కోట్ల మూలధన సహాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదిత మూలధనం బ్యాంకు వృద్ధి రేటుకు తోడ్పడుతుంది. పీఎన్‌బీ నియంత్రణ సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా నడవటానికి ఇప్పటికే ప్రభుత్వం ఈ సంవత్సరం తొలి నాళ్లలో ఈ బ్యాంకుకు రూ. 2,816 కోట్ల మూలధన సహాయం చేసిందని మెహతా వివరించారు.