బిజినెస్

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: చమురు మార్కెటింగ్ సంస్థలు మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దీంతో ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.20కు, లీటర్ డీజిల్ ధర రూ. 79.89కి చేరింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.85కు, లీటర్ డీజిల్ ధర రూ. 75.25కు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.18కి, లీటర్ డీజిల్ ధర రూ. 79.57కు పెరిగింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.65కు, లీటర్ డీజిల్ ధర రూ. 77.10కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నాలుగేళ్ల గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటంతో పాటు దేశంలో ఇంధన రవాణా వ్యయం పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర ఒక బారెల్‌కు 85 డాలర్లకు పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరకు, రవాణా తదితర వ్యయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులను కలుపుకొని దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తున్నారు.