ఆంధ్రప్రదేశ్‌

కేంద్రానికి కంటగింపుగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 3: కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోంది.. అయినా కుంగిపోకుండా దీక్షా దక్షతలతో పనిచేస్తున్నాం.. ఇదే వారికి కంటగింపుగా మారింది.. లక్ష్య సాధనలో ఏదీ లెక్కచేయకుండా ప్రజల సంతృప్తి స్థాయి ప్రామాణికంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. బుధవారం కార్యదర్శులు, శాఖాధిపతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల సంతృప్తి స్థాయిని పెంచటమే అంతిమ లక్ష్యం కావాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఫలితాలు సాధించాలన్నారు. ప్రభుత్వ పనితీరుపై ఇప్పటికే ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి సంతృప్తి వచ్చిందని ఇంకా మెరుగుపరచు కోవాలని సూచించారు. క్షేత్ర స్థాయి నుంచి శాఖాధిపతి వరకు ప్రతి ఒక్కరి నుంచి బాధ్యతాయుతమైన పనితీరు కనబరచినప్పుడే ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతామని తెలిపారు. మనం చేస్తున్న పని అంతిమంగా ప్రజలకు ఉపయోగపడాలన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చివరి మైలు రాయి వరకు చేరాలన్నారు. కరవు రహిత మాగాణంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమన్నారు. ఆ దిశగా అంతా చిత్తశుద్ధితో పనిచేయాలని ఉద్బోధించారు. మనం ఎంత కష్టపడుతున్నామో జాతీయ స్థాయిలో లభిస్తున్న పురస్కారాలే చెప్తున్నాయి.. ఈ కృషి చాలదు.. ఇంకా రెట్టింపు వేగం, రెట్టించిన కష్టంతో పనిచేసినప్పుడే లక్ష్యాలను అధిగమించ గలమన్నారు. పనుల్లో అలసత్వం, ఉదాసీనత పనికిరాదు.. ఇక అలాంటి వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పజలు కోరుకున్న సుపరిపాలన అందిస్తున్నామని అందువల్లే సంతృప్తి స్థాయి పెరుగుతోందని చెప్పారు. పనితీరును మెరుగుపరచుకుంటే ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించ వచ్చన్నారు. కుటుంబ, సమాజ వికాసం ద్వారా కొత్త ప్రామాణికాలను తీసుకుని వినూత్న ఒరవడి సృష్టించామన్నారు. ప్రకృతి సేద్యంలో మనం చేసిన కృషి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిందని తెలిపారు. వ్యవసాయం అంటే అంతా ఆంధ్రప్రదేశ్‌వైపు చూసే పరిస్థితి నెలకొందని అయినప్పటికీ బాధ్యత మరింత పెరిగిందన్నారు. గ్రామదర్శినిలో నిర్దేశిత లక్ష్యాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజా సహకారం ఉంటే ఏదైనా సాధించగలమని ధీమా వ్యక్తంచేశారు. మన దృష్టికి వచ్చిన సమస్యలు సత్వరం పరిష్కరించ గలిగినప్పుడే సుపరిపాలనకు అర్థం ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్దఎత్తున సంక్షేమం, అబివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.. గ్రామీణాభివృద్ధి ఈ రాష్ట్రంలో జరిగినట్లు మరెక్కడా లేదన్నారు. జలవనరుల సంరక్షణ, నదుల అనుసంధానం, ఇంధన శాఖలో అద్వితీయమైన ఫలితాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉంటూ పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించటం, ప్రకృతి సేద్యం, గృహ నిర్మాణం, వైద్యరంగంలో సంస్కరణలు, విద్యారంగంలో పెనుమార్పులు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌ను అనతికాలంలోనే పైమెట్టులో నిలిపాయన్నారు.