బిజినెస్

పెరిగిన పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశంలో బంగారం, వెండి ధరలు శనివారం పెరిగాయి. ప్రపంచ మార్కెట్లలో పసిడి ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు స్థానిక ఆభరణాల వ్యాపారులు తాజాగా కొనుగోళ్లు జరపడం వల్ల దేశీయ బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 50 పెరిగి, రూ. 31,900కు చేరుకుంది. కాయిన్ మేకర్లు తగినంత కొనుగోళ్లు జరిపిన కారణంగా వెండి ధర కూడా తిరిగి కిలోకు రూ. 550 చొప్పున పెరిగి, రూ. 39,800కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు అధికంగా ఉండటంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడం వల్ల దేశీయంగా పసిడి ధర పెరిగిందని వ్యాపారులు తెలిపారు. ప్రపంచ మార్కెట్‌లో ఒక ఔన్స్ బంగారం ధర అధిక స్థాయి 1,202.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వెండి ధర కూడా ఒక ఔన్స్‌కు 14.63 డాలర్లకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర పది గ్రాములకు రూ. 50 పెరిగి, రూ. 31,900కు చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత గల పసిడి ధర పది గ్రాములకు రూ. 31,750కు చేరుకుంది. పసిడి ధర శుక్రవారం పది గ్రాములకు రూ. 250 తగ్గిన విషయం తెలిసిందే. అయితే సావరిన్ గోల్డ్ ధర యథాతథంగా 8గ్రాములకు రూ. 24,600 వద్ద కొనసాగింది. వెండి వంద నాణేల కొనుగోలు ధర రూ. 73,000 వద్ద, విక్రయం ధర రూ. 74,000 వద్ద కొనసాగింది.