బిజినెస్

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. కేంద్రంతో పాటు, కొన్ని రాష్ట్రాలు ఇంధనంపై సుంకాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముడి చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం మళ్లీ ఇంధన ధరలను పెంచాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) శనివారం ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.68కి చేరింది. అలాగే లీటర్ పెట్రోల్ ధర కోల్‌కతాలో రూ. 83.52కు, ముంబయిలో రూ. 87.15కు, చెన్నైలో రూ. 84.89కి చేరుకుంది. లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ. 73.24కు, కోల్‌కతాలో రూ. 75.09కి, చెన్నైలో రూ. 77.42కి పెరిగింది. అయితే ముంబయిలో మాత్రం లీటర్ డీజిల్ ధర 70 పైసలు తగ్గి, రూ. 76.75కి చేరుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం లీటర్ డీజిల్ ధరను రూ. 4 తగ్గిస్తున్నట్టు ప్రకటించిన మరుసటి రోజున ముంబయిలో డీజిల్ ధర కాస్త తగ్గింది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ. 1.5 చొప్పున తగ్గిస్తున్నట్టు ప్రకటించిన తరువాత గురువారం 12 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు లీటర్ ఇంధనంపై రూ. ఒకటి చొప్పున ధరలు తగ్గించాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు అధిక స్థాయిల వద్ద ఉన్నప్పటికీ దేశంలో ఇంధన ధరలు కాస్త తగ్గాయి. అయితే, వీటి ధరలు శనివారం మళ్లీ పెరిగాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ, ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరల ఆధారంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు రోజువారీగా పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తున్నాయి.