బిజినెస్

ఇంధన ధరలకు మళ్లీ రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన దరిమిలా ప్రజలకు ఒక్క రోజు కాస్త ఉపశమనం కలిగించిన ఇంధన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 1.50 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఈ నెల అయిదో తేదీన వీటి ధరలు లీటర్‌కు కనీసం రూ. 2.50 చొప్పున తగ్గాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వీటి ధరలు మరింత తగ్గాయి. అయితే మరుసటి రోజునుంచే మళ్లీ ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దీంతో వీటి ధరలు ఆదివారం నాటికి మూడు వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ ధర శనివారం 18 పైసలు పెరగగా, ఆదివారం మరో 14 పైసలు పెరిగింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఆదివారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.82కు పెరిగింది. అదేవిధంగా లీటర్ డీజిల్ ధర శని, ఆదివారాల్లో 29 పైసల చొప్పున పెరిగింది. దీంతో దీని ధర ఢిల్లీలో రూ. 73.53కు చేరింది. ముంబయిలో వ్యాట్‌ను తగ్గించినప్పటికీ, ఇప్పటికీ దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడే ఇంధన ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.29కి, డీజిల్ ధర రూ. 77.06కు చేరుకుంది.