బిజినెస్

ఐఐపీ, ద్రవ్యోల్బణమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: స్థూలార్థిక గణాంకాలు, రూపాయి కదలికలు, ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరల ధోరణి సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల సరళిని నిర్దేశించనున్నాయి. జూన్, ఆగస్టు నెలల్లో జరిగిన రెండు వరుస ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష సమావేశాల్లో కీలక వడ్డీ రేట్లను పెంచిన రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తాజాగా జరిగిన సమావేశంలో మాత్రం వాటిని యథాతథంగా కొనసాగించింది. పతనమవుతున్న రూపాయికి దన్నుగా నిలవడంతో పాటు అధిక ముడి చమురు ధరల కారణంగా ఎదురయ్యే ద్రవ్యోల్బణం ప్రమాదాలను తట్టుకునేందుకు ఆర్‌బీఐ ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను పెంచుతుందని అంతా భావించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శుక్రవారం ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ‘స్టాక్ మార్కెట్లలో సమీప భవిష్యత్తు వరకు ప్రతికూల ధోరణి నెలకొని ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక మార్కెట్లలో స్థిరత్వం ఏర్పడేంత వరకు ఈ ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులపై రాబడులు, రూపాయి విలువలో మార్పులు, చమురు ధరలు, ద్రవ్యలభ్యత వంటి అంశాలు వచ్చే వారంలో స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈక్విటి విలువ సాధారణ స్థితికి చేరుకోవాల్సి ఉంది. దీనికి కొంత సమయం పడుతుంది’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు.
‘ప్రపంచ పరిస్థితులను పరిశీలిస్తే, ముడి చమురు ధరలు అంతకంతకూ పెరుగుతూ పోతుండటం, ప్రపంచ వడ్డీ రేట్లు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రపంచ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్న అంశాలు. స్థూలార్థిక పరిస్థితులను పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. రూపాయి విలువ, ముడి చమురు ధరలు స్టాక్ మార్కెట్ల పథాన్ని నిర్దేశిస్తాయి’ అని కోటక్ మహీంద్ర అసెట్ మేనేజ్‌మెంట్ కంపనీ, ప్రోడక్ట్స్ విభాగం అధిపతి సీఐఓ (డెబిట్) లక్ష్మి ఐయ్యర్ పేర్కొన్నారు. రూపాయి విలువ పతనం, అధిక ముడి చమురు ధరల కారణంగా శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ భారీగా 1,850.15 పాయింట్లు పతనమయి, 34,376.99 పాయింట్ల వద్ద ముగిసింది. ‘ఆర్థిక గణాంకాల దిశగా చూస్తే, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రతి ఏటా ప్రపంచ బ్యాంకుతో జరిపే సమావేశం ఇండోనేసియాలోని బాలిలో మొదలయింది. అందువల్ల ఐఎంఎఫ్ వచ్చే వారంలో తన తాజా ప్రపంచ ఆర్థిక స్థితిగతుల నివేదికను విడుదల చేయనుంది. అమెరికా సెప్టెంబర్ నెల ద్రవ్యోల్బణం గణాంకాలు గురువారం వెలువడనున్నాయి. ‘్భరత్‌లో చూస్తే, ఆగస్టు నెల ఐఐపీ గణాంకాలు, సెప్టెంబర్ నెల వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) గణాంకాలు శుక్రవారం వెలువడనున్నాయి’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ పీసీజీ, క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీ విభాగం అధిపతి వీకే శర్మ పేర్కొన్నారు. ‘మార్కెట్లు విస్తృత స్థాయిలో అమ్మకాలకు గురయ్యాయి. మంచి నాణ్యమయిన స్టాక్‌లు కూడా సాధారణ స్టాక్‌ల బాటలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే, ప్రస్తుత మార్కెట్ పతనం ప్రపంచ అభివృద్ధి చెందిన మార్కెట్లతో సంబంధం లేకుండా జరిగింది. స్టాక్‌ల విలువ విస్తృత స్థాయిలో దిద్దుబాటుకు గురయి ఉన్నందున త్వరలోనే మార్కెట్ తిరిగి బలంగా పుంజుకుంటుందనే ఆశ ఉంది. కార్పొరేట్ కంపెనీల రెండో త్రైమాసిక ఫలితాలు వెలువడటం ప్రారంభం కాగానే మార్కెట్‌లో ప్రశాంతత చోటు చేసుకుంటుందని, అతి అమ్మకాలకు లోనయిన మార్కెట్ల నుంచి వేగవంతమయిన ర్యాలీలు వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం’ అని సామ్‌కో సెక్యూరిటీస్, స్టాక్‌నోట్ వ్యవస్థాపకుడు ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) జిమీత్ మోదీ పేర్కొన్నారు.