క్రైమ్/లీగల్

పోలీసులకు చిక్కిన రేషన్ బియ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, అక్టోబర్ 8: మండలంలోని గొల్లలపేట సమీపంలో సాయికృష్ణ పాలిటెక్నికల్ కళాశాల వద్ద ఆదివారం రాత్రి 16.6క్వింటాళ్ళ రేషన్ బియ్యం స్థానిక పోలీసులకు చిక్కాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిమర్ల మండలం పారశాం గ్రామం నుండి టాటా ఎసి ఆటోలో బండారు అప్పారావు అనే కిరాణా వ్యాపారి బొండపల్లి గ్రామానికి తరలిస్తుండగా స్థానిక ఎఎస్సై జగన్నాథం దాడి చేసి వాహనం బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అనంతరం గజపతినగరం సిఎస్‌డిటి ఎన్‌వివిఎస్ మూర్తి 6ఎ కేసు నమోదు చేశారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని గజపతినగరం ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించగా వాహనాన్ని బొండపల్లి పోలీసులకు అప్పగించారు