బిజినెస్

విశాఖ-బ్యాంకాక్ మధ్య విమాన సర్వీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 8: విశాఖ నుంచి బ్యాంకాక్‌కు ఎయిర్ ఏషియా డైరెక్ట్ సర్వీసును నడపనుంది. థాయ్ ఎయిర్ ఏషియా ముఖ్య కార్యనిర్వాహక అధికారి రాజకుమార్ పరంధామన్, థాయ్ దేశ పర్యాటక శాఖ డైరక్టర్ చొలాడ సిద్దవరన్ ఆదివారం ఇక్కడ సంయుక్త విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పరంధామన్ మాట్లాడుతూ డిసెంబర్ ఏడవ తేదీన ఈ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. విశాఖ నుంచి కేవలం 2999 రూపాయల ఒకవైపు చార్జితో బ్యాంకాక్‌కు వెళ్లవచ్చని ఆయన చెప్పారు. డిసెంబర్ ఏడవ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకూ విశాఖ నుంచి బ్యాంకాక్ వెళ్లాలనుకునేవారికి ప్రమోషన్ ఆఫర్‌గా ఒకవైపు ప్రయాణ చార్జీ కింద కేవలం 1999 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నామని చెప్పారు. వీసా కూడా అత్యంత సులభతరం చేస్తున్నామని తెలియచేశారు. ఇప్పటికే విశాఖ నుంచి కౌలాలంపూర్, బెంగళూరు, కోల్‌కత్తాలకు ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు నడుస్తున్నాయని ఆయన చెప్పారు. భారత దేశం నుంచి చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా, జైపూర్, కొచ్చి నుంచి అనేక మంది బ్యాంకాక్‌కు వెళుతున్నారని ఆయన చెప్పారు.్థయ్ పర్యాటక శాఖ డైరక్టర్ చొలాడ సిద్దవరన్ మాట్లాడుతూ పర్యాటక రంగంలో థాయ్‌లాండ్ మొదటి పది స్థానాల్లో ఉందని చెప్పారు. తమ దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతున్నారని చెప్పారు. మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు ఆమె తెలియచేశారు.