బిజినెస్

కొత్త డాట్సన్ బ్రాండ్ కార్లను విడుదల చేసిన నిస్సాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 10: జపాన్‌కు చెందిన ఆటోమేకర్ నిస్సాన్ ‘గో అండ్ గోప్లస్’ విధానంతో అప్‌డేట్ చేసిన డాట్సన్ బ్రాండ్ కార్లను బుధవారం ఆవిష్కరించింది. కంపెనీ నిర్ధేశించుకున్న వ్యూహం మేరకు టైర్-2, టైర్-3 లొకేషన్లలోని రోడ్లకు అనుగుణంగా ఈ కార్లను అప్‌డేట్ చేయడం జరిగిందని కంపెనీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మొత్తం 28 కొత్త ఫీచర్లను, వంద అప్‌గ్రేట్లతో కూడిన కార్లను విడుదల చేసినట్లు నిస్సాన్ మోటార్ ఇండియా మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ పీటర్ క్లిస్సోల్డ్ తెలిపారు. ఈ యేడాది నెలవారీగా టైర్-2, టైర్-3 లొకేషన్లలో కార్ల విక్రయాలను ప్రారంభించాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. డాట్సన్ బ్రాండ్‌కు చెందిన చిన్న కార్‌ను ఈ కంపెనీ గత 2014 గోఇన్ పేరిట, 2015లో గోప్లస్ పేరిట విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ కార్లకు సుమారు ఐదు లక్షల మంది కస్టమర్లున్నారు. తమ కంపెనీవద్ద 270 ఔట్‌లెట్స్ ఉన్నాయని ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరికొంతమంది డీలర్లను నియమించదలిచామని ఆయన చెప్పారు. ఎంతమంది డీలర్లను నియమించేది తెలిపేందుకు పీటర్ నిరాకరించారు. కొత్తగా రూపొందించిన కార్లను విదేశీ మార్కెట్లలో విక్రయించే ఆలోచనవుందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటికే తమ కంపెనీ దక్షిణాఫ్రికా, నేపాల్‌తోబాటు మరికొన్ని దేశాలకు కార్లను ఎగుమతి చెస్తోందన్నారు. కాగా కొత్తగా రూపొందించిన మల్టీమీడియా ప్రచారాన్ని ఈ సందర్భంగా కంపెనీ ప్రారంభించింది.