రాష్ట్రీయం

వరవరరావు మావోయిస్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: పౌర హక్కుల నేతలుగా చలామణి అవుతున్న విరసం నేత వరవరరావుమావోయిస్టేనని రాష్ట్ర అదనపుడీజీ(శాంతిభద్రతలు) జితేంద్ర వెల్లడించారు. వరవరరావుకు మావోలతో సంబంధాలున్నాయనడానికి మహారాష్ట్ర పోలీసుల వద్ద తిరుగులేని ఆధారాలున్నాయని గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. ఎన్నికల బందోబస్తుకు సంబంధించి ఆంధ్రభూమితో మాట్లాడిన ఆయన ‘వరవరరావు ప్రజా సంఘాల ముసుగులో మావోస్టులతో కలిసి పనిచేస్తున్నారు’అని ఆరోపించారు. ఏదైనా రాష్ట్రంలో మావోస్టులకు పోలీసుల నుంచి ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వరవరరావుకు క్షణాల్లో సమాచారం ఎలా వస్తోందని ఆయన ప్రశ్నించారు. ఆయన నిరంతరం మావోస్టులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పడానికి వీధుల్లోకి వచ్చి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయడమే నిదర్శనమని జితేంద్ర అన్నారు. చత్తీస్‌గఢ్‌లో పోలీసులు ఎదురు కాల్పుల్లో మావోస్టులు మృతి చెందితే వారి పక్షాన వరవరరావు ఢిల్లీలో సుప్రీం కోర్టును ఆశ్రయించారని ఆయన గుర్తుచేశారు. కాగా వరవరరావు ఇంటి వద్ద మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులతో ఉమ్మడి నిఘా ఉంచామన్నారు. ఎన్నికల్లో మావోలు విధ్వంసక చర్యలకు వ్యూహాలను చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్ల వద్ద గస్తీని ముమ్మరం చేశామని అడిషనల్ డీజీ వెల్లడించారు.