ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్‌కు శంకుస్థాపన చేసిన గంటల వ్యవధిలోనే ఆ పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజక వర్గాల్లో హంద్రీనీవా ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి బ్రాంచ్ కాలువలకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. బ్రాంచ్ కెనాల్ పరిధిలో భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా కాలువ పనులు చేపడుతున్నారని ఆయా నియోజకవర్గాల రైతులు గత ఆరు నెలలుగా నిరసనలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయితే వాటిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి బ్రాంచ్ కెనాల్‌కు శంకుస్థాపన చేశారు. ఏపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని నర్సాపురం, సిరిపి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. భూములకు నష్టపరిహారం చెల్లించిన తర్వాత బ్రాంచ్ కెనాల్ పనులు చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో చేపట్టిన పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు.