బిజినెస్

ప్రకృతి విపత్తులతో భారత్ విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాస, అక్టోబర్ 12: వాతావరణ సంబంధ విపత్తుల కారణంగా గత 20 సంవత్సరాల్లో భారత్ 79.5 బిలియన్ అమెరికన్ డాలర్లు నష్టపోయినట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించిన నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సంభవిస్తున్న పెనుమార్పుల కారణంగా సంభవించిన విలయాల వల్ల జరిగిన నష్టంపై ఐరాస ‘1998-2007 వైపరీత్యాలు- పేదరికం, ఆర్థిక నష్టాలు’ పేరుతో విడుదల చేసిన నివేదికలో గతంలో భారత్‌లో జరిగిన వైపరీత్యాల నష్టం కంటే ఈ కాలంలో జరిగిన నష్టం 151 శాతం ఎక్కువని పేర్కంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన నష్టాన్ని అంచనా వేస్తే అది 2.908 ట్రిలియన్ యూఎస్ డాలర్లుగా నిర్ధారించింది. ఇది గత రెండు దశాబ్దాలతో పోలిస్తే రెట్టింపు ఎక్కువ. ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థ నష్టంలో 77 శాతమని బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలియజేసింది.
ఈ విపత్తుల కారణంగా అత్యధికంగా నష్టపోయిన వాటిలో అమెరికా దేశం ముందుంది. ఈ దేశం 944.9 బిలియన్ల అమెరికన్ డాలర్లు, చైనా 492.2 బిలియన్లు, జపాన్ 376.3 బిలియన్లు, భారత్ 79.5 బిలియన్లు, ప్యూరిటో రికో 71.7 బిలియన్ల డాలర్లు నష్టపోయాయి. ఈ ప్రకృతి విపత్తులు తుపానులు, వరదలు, పెనుగాలులు, భూకంపాలు వల్ల సంభవించినట్టు ఐరాస వెల్లడించింది. 1998-2017 మధ్య జరిగిన వైపరీత్యాల సంఖ్య కూడా అధికంగానే ఉంది. మొత్తం 7,255 విపత్తులు జరిగాయిని, 1.3 మిలియన్ల ప్రజలు మృతి చెందారని, 4.4 మిలియన్ల మంది గాయపడటం, నిరాశ్రయులు కావడం జరిగినట్టు తెలియజేసింది.