బిజినెస్

పడిపోయిన పారిశ్రామికోత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు ఆగస్టు నెలలో మూడు నెలల కనిష్ట స్థాయి 4.3 శాతానికి చేరింది. మైనింగ్ రంగంలో ఉత్పత్తి బాగా తగ్గిపోవడంతో పాటు క్యాపిటల్ గూడ్స్ విక్రయాలు తగ్గిపోవడం వల్ల ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు పడిపోయిందని శుక్రవారం వెలువడిన సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్‌ఓ) గణాంకాలు వివరించాయి. దేశంలో పారిశ్రామికోత్పత్తిని పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా లెక్కగడతారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో ఐఐపీ 4.8 శాతం ఉండిందని సీఎస్‌ఓ తెలిపింది. ఆగస్టు నెలలో గనుల రంగంలో ఉత్పత్తి గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 0.4 శాతం తగ్గిపోయింది. నిరుడు ఆగస్టులో మైనింగ్ రంగం ఉత్పత్తి 9.3 శాతం పుంజుకుంది.
అదేవిధంగా క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి వృద్ధి రేటు ఆగస్టు నెలలో అయిదు శాతానికి తగ్గింది. నిరుడు ఆగస్టు నెలలో 7.3 శాతం వృద్ధి చెందింది. ఐఐపీ వృద్ధి మే నెల తరువాత ఇంత తక్కువ స్థాయిలో ఉండటం ఇదే మొదటిసారి. మే నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 3.9 శాతం నమోదయింది. ఆ తరువాత జూన్‌లో పారిశ్రామికోత్పత్తి 6.8 శాతం, జూలైలో 6.5 శాతం చొప్పున వృద్ధి చెందింది. వస్తు తయారీ (మాన్యుఫాక్చరింగ్) రంగం ఉత్పత్తి ఆగస్టులో 4.6 శాతం వృద్ధి చెందింది. నిరుడు ఆగస్టులో ఇది 3.8 శాతం ఉండింది.
బలపడిన రూపాయి
* డాలర్‌తో మారకం విలువ 55 పైసలు పెరుగుదల
ముంబయి, అక్టోబర్ 12: రూపాయి క్రమంగా కోలుకుంటోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ వరుసగా మూడో రోజు 55 పైసలు పెరిగి, 73.57 వద్ద ముగిసింది. గత మూడు వారాలలో ఒకే రోజు రూపాయి విలువ ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడంతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా బలపడిన కారణంగా రూపాయి పుంజుకుంది. అత్యవసరం కాని వస్తువుల దిగుమతులను అణచివేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుందని వచ్చిన సంకేతాలు ఫోరెక్స్ మార్కెట్‌లో రూపాయి బలపడటానికి దోహదపడ్డాయని ట్రేడర్లు తెలిపారు.