బిజినెస్

స్వల్పంగా పెరిగిన చిల్లర ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: అందరూ అంచనా వేసినట్టుగానే దేశంలో వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నెలలో స్వల్పంగా పెరిగింది. ముడి చమురు, ఆహార వస్తువుల ధరలు అధికంగా ఉండటం వల్ల చిల్లర ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగి 3.77 శాతానికి చేరింది. ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో పది నెలల కనిష్ట స్థాయి 3.69 శాతానికి తగ్గింది. 2017 సెప్టెంబర్‌లో చిల్లర ద్రవ్యోల్బణం 3.28 శాతం ఉండింది. అయితే చిల్లర ద్రవ్యోల్బణం నాలుగు శాతానికి మించకూడదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిర్దేశించిన పరిమితికి లోబడే సెప్టెంబర్ నెల సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం ఉంది.
కేటగిరీల వారీగా చూస్తే, తృణధాన్యాలు, మాంసం, చేపలు, కోడిగుడ్లు, పాల ఉత్పత్తుల వంటి వాటిలో చిల్లర ద్రవ్యోల్బణం పెరిగింది. పండ్లకు సంబంధించి సెప్టెంబర్ నెలలో చిల్లర ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. మొత్తం మీద కన్స్యూమర్ ఫుడ్ విభాగంలో చిల్లర ద్రవ్యోల్బణం 0.51 శాతానికి పెరిగింది. ఇది ఆగస్టు నెలలో 0.29 శాతం ఉండింది. ఫ్యూయెల్, లైట్ కేటగిరీలో ధరల పెరుగుదల రేటు సెప్టెంబర్ నెలలో 8.47 శాతం ఉంది.