బిజినెస్

మళ్లీ పుంజుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి కోలుకోవడం దేశీయ స్టాక్ మార్కెట్లకు శుక్రవారం దన్నుగా నిలిచింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ భారీగా 700 పాయింట్లకు పైగా పుంజుకుంది. గత 19 నెలల్లో సెనె్సక్స్ ఒక్క సెషన్‌లో ఇంత భారీగా పుంజుకోవడం ఇదే మొదటిసారి. వరుసగా రెండు రోజుల నష్టాలకు ముగింపు పలికి మూడో రోజు ప్రపంచ స్టాక్ మార్కెట్లు తిరిగి బలపడటం కూడా దేశీయ మార్కెట్లు లాభాలు ఆర్జించడానికి తోడ్పడింది. ఫోరెక్స్ మార్కెట్‌లో శుక్రవారం ఇంట్రా-డేలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 53 పైసలు పెరిగి, 73.59కి చేరుకుంది. అయితే, సెనె్సక్స్, నిఫ్టీ రెండూ కూడా గత ఆరు వారాల్లో మొదటివారంలో లాభపడ్డాయి. ఈ వారంలో సెనె్సక్స్ 366.59 పాయింట్లు, నిఫ్టీ 156.05 పాయింట్ల చొప్పున పుంజుకున్నాయి. సెనె్సక్స్ శుక్రవారం ఉదయం పటిష్టమయిన స్థాయి వద్ద ప్రారంభమయి, తరువాత రిటెయిల్ ఇనె్వస్టర్ల నుంచి అందిన కొనుగోళ్ల మద్దతుతో మరింత ముందుకు సాగుతూ 34,808.42 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే కొంత సేపటి తరువాత ఆర్జించిన లాభాలను కొంత కోల్పోయింది. అయినప్పటికీ క్రితం ముగింపుతో పోలిస్తే గణనీయంగా 732.43 పాయింట్ల (2.15 శాతం) ఎగువన 34,733.58 పాయింట్ల వద్ద ముగిసింది. 2017 మార్చి తరువాత సెనె్సక్స్ ఒకే సెషన్‌లో ఇంత భారీగా పుంజుకోవడం ఇదే మొదటిసారి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే శుక్రవారం 237.85 పాయింట్ల (2.32 శాతం) ఎగువన 10,472.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. శుక్రవారం మార్కెట్ పనివేళలు ముగిసిన తరువాత ఆగస్టు నెల ఐఐపీ గణాంకాలు, సెప్టెంబర్ నెల ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న తరుణంలో దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) మార్కెట్‌లో నిరాటంకంగా పెట్టుబడులు పెడుతున్న సమయంలో మదుపరులు ఇటీవల ధరలు బాగా పడిపోయిన వాహన, స్థిరాస్తి, లోహ, చమురు- సహజ వాయువు, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, విద్యుత్, వౌలిక సదుపాయాలు, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లను భారీగా కొనుగోలు చేశారు. ఐటీ దిగ్గజం టీసీఎస్ రెండో త్రైమాసికంలో మంచి లాభాలను ఆర్జించడం వల్ల ఫలితాలు వెలువడే సీజన్ ప్రారంభం బాగుందని, ఇది కూడా మార్కెట్‌లో ర్యాలీకి దోహదపడిందని సాంక్టమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇనె్వస్ట్‌మెంట్ ఆఫీసర్ సునిల్ శర్మ పేర్కొన్నారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో మారుతి సుజుకి శుక్రవారం అత్యధికంగా 5.89 శాతం లాభపడింది. ఎంఅండ్‌ఎం 5.29 శాతం లాభంతో రెండో స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థల్లో బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, కోల్ ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐటీసీ, రిల్, టాటా స్టీల్, అదాని పోర్ట్స్, ఆసియన్ పెయింట్స్, వేదాంత, ఓఎన్‌జీసీ, యెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, భారతి ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, విప్రో, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, సన్ ఫార్మా ఉన్నాయి. టీసీఎస్ షేర్ల విలువ శుక్రవారం అత్యధికంగా 3.10 శాతం పడిపోయింది. గురువారం వెలువరించిన రెండో త్రైమాసిక ఫలితాలలో ఈ కంపెనీ మంచి నికర లాభాన్ని ఆర్జించినప్పటికీ, మార్జిన్‌పై నెలకొన్న ఆందోళనల కారణంగా దీని షేర్ విలువ పడిపోయింది.