బిజినెస్

థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు చాలినంత బొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కొతా, అక్టోబర్ 13: ఈ నెల 12వ తేదీ వరకు థర్మల్ విద్యుత్ రంగానికి తన ఉత్పత్తిలో 84 శాతం బొగ్గును సరఫరా చేసినట్లు కోల్ ఇండియా లిమిటెడ్ ప్రకటనలో తెలిపింది. రోజుకు 1.34 మిలియన్ టన్నుల బొగ్గును థర్మల్ ప్లాంట్లకు సరఫరా చేశారు. రోజుకు 14 నుంచి 15 ర్యాక్స్ బొగ్గును పశ్చిమబెంగాల్ విద్యుత్ అభివృద్ధి సంస్థ పరిధిలోని విద్యుత్ ప్లాంట్లకు సరఫరా చేశారు. తమిళనాడు విద్యుత్‌సంస్థ పరిధిలోని విద్యుత్ ప్లాంట్లకు కూడా బొగ్గును సరఫరా చేశారు. గత ఏడాదితో పోల్చితే రోజుకు 1.27 మిలియన్ టన్నుల బొగ్గును విద్యుత్ రంగానికి సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. గత ఏడాదిపైన బొగ్గు ఉత్పత్తి 9 శాతం వృద్ధిరేటును సాధించారు. థర్మల్ ప్లాంట్లు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తమకు అవసరమైన బొగ్గును వెంటనే సరఫరా చేయాలని ఈ బొగ్గు సంస్థల యాజమాన్యాలు ప్రధామంత్రి కార్యాలయాన్ని కోరాయి. క్యాప్టివ్ విద్యుత్ ఉత్పత్తి సంఘం చేసిన విజ్ఞప్తితో స్పందించిన ప్రధాన మంత్రి కార్యాలయం వెంటనే రంగంలోకి దిగి బొగ్గు ఉత్పత్తిని పెంచాలని కోల్ ఇండియాను ఆదేశించింది.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు నికర లాభం రూ.91.41 కోట్లు
* వృద్ధిరేటు 33.95 శాతం నమోదు
* బ్యాంకు ఎండీ సంజయ్ అగర్వాల్ వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 2018-19 సంవత్సరానికి 33.95 శాతం వృద్ధిరేటుతో రూ.91.41 కోట్ల నికర లాభాలను సాధించింది. గత ఏడాది ఇదే కాలానికి రూ. 68.24 కోట్ల నికర లాభాలను సాధించినట్లు ఆ బ్యాంకు వెల్లడించింది. మొత్తం ఆదాయం 60.2 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం రూ.502.88 కోట్ల నుంచి రూ.805.87 కోట్లకు పెరిగింది. తమ బ్యాంకు రిజర్వు బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి నాణ్యమైన సేవలను ఖాతాదారులకు అందిస్తున్నట్లు ఎయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎండీ, సీఈవో సంజయ్ అగర్వాల్ చెప్పారు. రిటైల్ అసెట్స్, ఇంక్రిమెంటల్ డిపాజిట్స్ సేకరణలో ముందడుగు వేయనున్నట్లు చెప్పారు. 2022 నాటికి పది బిలియన్ అసెట్స్‌కు చేరుకోవాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. తమ బ్యాంకు రుణాల పోర్ట్ఫులియో రూ.20,200 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రెండవ త్రైమాసిక కాలానికి రూ.321 కోట్లకు చేరింది. గత ఏడాదిపైన ఈ విభాగంలో వృద్ధిరేటు 46 శాతం నమోదైంది.