తెలంగాణ

విలక్షణ తీర్పులో కాంగ్రెస్‌దే పై‘చేయి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి......
==============

నల్లగొండ, అక్టోబర్ 13: ఆచార్య నాగార్జునుడి నడయాడిన నేల..ఆధునిక దేవాలయం, తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నెలవైన నాగార్జున సాగర్(చలకుర్తి) నియోజకవర్గం రాజకీయంగాను ప్రత్యేకతను చాటుతు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ రాష్ట్రంలో విశిష్టతను చాటుతుంది. 1962లో పెద్దవూరా నియోజకవర్గం పేరుతో, 1967నుండి చలకురి నియోజకవర్గం పేరుతో, 2009లో నాగార్జున సాగర్ నియోజకవర్గం పేరుతో కొనసాగిన ఈ నియోజకవర్గంలో ఆది నుండి ఓటర్లు విలక్షణ తీర్పునిస్తు తమ రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తుండగా గెలుపు ఓటముల పర్వంలో కాంగ్రెస్ పైచేయి సాధిస్తు వస్తుంది. 1962నుండి జరిగిన పనె్నండు ఎన్నికల్లో ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలువగా, మూడుసార్లు టీడీపీ, ఒక్కోసారి సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అత్యధికంగా ఈ నియోజకవర్గంలో జనతాపార్టీ, టీడీపీ, కాంగ్రెస్‌ల నుండి తొమ్మిది పర్యాయాలు పోటీ చేసిన కె.జానారెడ్డి ఏడుసార్లు గెలుపొంది నియోజకవర్గం బాహుబలిగా నిలిచారు. ఉపాధ్యాయ వృత్తి వదిలి రాజకీయాల్లోకి వచ్చిన జానారెడ్డి 1983-89మధ్య ఎన్‌టిఆర్ ప్రభుత్వ హాయంలో ఏకంగా 11మంత్రిత్వశాఖలు నిర్వహించారు. 1992లో కోట్ల విజయభాస్కరరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో, 2004-09వరకు వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2009లో వైఎస్సార్ ప్రభుత్వంలో, ఆయన మరణాంతరం రోశయ్య ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కని జానాకు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి దక్కింది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో సుదీర్ఖకాలం 16సంవత్సరాల 4నెలల 19రోజుల పాటు మంత్రిగా పనిచేసిన రికార్డు జానారెడ్డి సాధించారు. తెలంగాణ తొలి శాసన సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు.

గెలుపు ఓటముల సాగరం...!
నాగార్జున సాగర్ పూర్వ నియోజకవర్గం పెద్దవూరాకు తొలిసారిగా 1962లో నిర్వహించిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధి పి.పర్వతరెడ్డి సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ అభ్యర్ధి జి.ఎన్.రెడ్డిపై గెలుపొందారు. తదనంతరం 1967లో చలకురి నియోజకవర్గంగా పేరుమారిన ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగిన నిమ్మల రాములు సమీప సీపీఎం అభ్యర్ధి ఎం.ఆదిరెడ్డిపై విజయం సాధించారు. కాంగ్రెస్‌లో చేరిన నిమ్మల రాములు 1972కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రత్యర్ధి ఇండిపెండెంట్ ఎం.ఆదిరెడ్డిపై గెలుపొందారు. 1978లో మరోసారి నిమ్మల రాములు కాంగ్రెస్(ఐ)నుండి పోటీ చేసి తన రాజకీయ శిష్యుడైన జనతాపార్టీ అభ్యర్ధి కుందూరు జానారెడ్డిపై గెలిచారు.