తెలంగాణ

టీఆర్‌ఎస్‌పై విష ప్రచారాన్ని మేధావులు తిప్పికొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: టీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తోన్న విష ప్రచారాన్ని మేధావి వర్గాలు తిప్పికొట్టాలని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. దశాబ్దన్నర పాటు అనేక ఉద్యమాలు, పోరాటాల సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వం సరైన మార్గంలోనే ముందుకు వెళ్తుందన్నారు. ఉద్యమ ఆకాంక్షల మేరకే తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు సంకుచిత మనస్తత్వంతో పని చేస్తున్నాయని విమర్శించారు. అందుకే ప్రజా కోర్టులో ప్రతిపక్షాలను ఎండగట్టడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ అసాధారణ పాలన వల్లనే తెలంగాణ ఉద్యమానికి పునాది అయిన నీళ్లు, నిధులు, నియమకాలు మూడు అంశాల్లో సంపూర్ణ న్యాయం చేస్తున్నామన్నారు. ఒకవైపు తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేయాలన్న లక్ష్యం మేరకు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, పాత ప్రాజెక్టులకు రీ డిజైనింగ్ చేసామన్నారు.
ప్రజల దాహార్తిని తీర్చడానికి మిషన్ భగీరథ కార్యక్రమం పూర్తి కావచ్చిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయన్నారు. ఉద్యోగ నియామకాలను కూడా కోర్టులో సవాల్ చేసి అడ్డంకులు సృష్టించారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అభివృద్ధి యజ్ఞానాకి అడ్డం పడుతున్న ప్రతిపక్ష పార్టీల అసలు రూపాన్ని ప్రజల ముందు ఉంచడంలో తమకు మేధావి వర్గం అండగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.