బిజినెస్

ప్రమాద ఘంటికలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 27: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) సూచీల పతనం ఆందోళన కలిగిస్తున్నది. భవిష్యత్తుపై ప్రమాద ఘంటికలను మోగిస్తున్న మార్కెట్ తీరుకు మదుపరులు బెంబేలెత్తిపోతున్నారు. విదేవీ పెట్టుబడులు భారీగా షేర్లను అమ్ముతుంటే, దేశీయ మదుపరులు కొంత వరకూ కొనుగోళ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ స్థానిక వ్యక్తిగత పెట్టుబడిదారుల నుంచి సానుకూల స్పందన లేకపోతే, ఈవారం స్టాక్ మార్కెట్ మరింత దారుణంగా దెబ్బతిని ఉండేదన్నది వాస్తవం. ఒక వారంలో సెనె్సక్స్ ఏకంగా 966.32 పాయింట్లు పతనం కావడం మార్కెట్‌లో లావాదేవీల తీరుతెన్నులకు అద్దం పడుతుంది. గతవారం లావాదేవీలకు చివరి రోజైన 19వ తేదీన సెనె్సక్స్ 34,315.63 పాయింట్ల వద్ద ముగిసింది. ఈవారం మొదటి రోజు, సోమవారం ఆరంభమైన పతనం దాదాపుగా చివరి వరకూ కొనసాగింది. ఆ రోజు 34,134.38 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్ ఆ మరుసటి రోజు మరింతగా దిగజారి, 33,847.23 పాయింట్లకు పతనమైంది. 24న కొంత మెరుగై, 34,033.96 పాయింట్లకు చేరింది. కానీ, ఆతర్వాత మళ్లీ బుల్ రన్‌కు బ్రేక్ పడింది. 25న 32,370.04 పాయింట్లుగా నమోదైన సెనె్సక్స్ శుక్రవారం మరింతగా పడిపోయింది. ఆటుపోట్ల మధ్య కొంత సేపు కొనసాగి, చివరికి 33,349.31 పాయింట్ల వద్ద ముగిసింది. అంటే, స్థూలంగా పతనం వెయ్యి పాయింట్లకు దరిదాపుల్లోకి వెళ్లింది. ఈ పరిస్థితి సహజనంగానే మదుమరుల్లో ఆందోళనకు కారణమవుతుంది. రూపాయి మారకపు విలువ పతనం నుంచి త్వరగా కోలుకోకపోవడం ఈ పరిస్థితికి ఒక కారణమైతే, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర విపరీతంగా పెరగడం మరో కారణం. ద్రవ్య లబ్ధత తక్కువై, బ్యాంకింగేతర సంస్థలు దారుణంగా నష్టపోతున్నాయి. అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం వల్ల ఆసియా మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నది. సహజంగా దసరా, దీపావళి పండుగ సీజన్‌లో పెట్టుబడులు భారీగా పెరగాలి. స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలు పుంజుకొని, బుల్ రన్ కొనసాగాలి. షేర్ మార్కెట్ కొనుగోలుదారుల ఆర్డర్లతో ఉక్కిరిబిక్కిరికావాలి. కానీ, దసరా తర్వాత పరిస్థితి భిన్నంగా మారింది. పండుగ సీజన్ కళకళ ఏ మా త్రం కనిపించడం లేదు. విదేశీ పెట్టుబడిదారులు భారీగా షేర్లను అమ్మేశారు. వారంతా పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం స్టాక్ మార్కెట్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఫలితంగా తొమ్మిది నెలల కాలంలో కనిష్టానికి సెనె్సక్స్ పడిపోయింది. వారంతపు సూచీలను పరిశీలిస్తే, ఎస్ బ్యాంక్ అత్యధికంగా 8.97 శాతం నష్టపోయింది. యాక్సిస్ బ్యాంక్ (4.04 శాతం), ఇండస్‌ఇండ్ బ్యాంక్ (3.14 శాతం), టీసీఎస్ (2.86 శాతం), కోటక్ మహీంద్ర (2.48 శాతం), ఓఎన్‌జీసీ (2.47 శాతం), ఇన్ఫోసిస్ (2.42 శాతం), ఐటీసీ (2.30 శాతం), ఎన్‌టీపీసీ (1.58 శాతం), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.49 శాతం) చొప్పున నష్టాలను చవిచూవాయి. స్టాక్ మార్కెట్ మరింత పతనమయ్యే ప్రమాదం పొంచివున్న నేపథ్యంలో, వచ్చే వారం లావాదేవీలు ఏ విధంగా కొనసాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.