తెలంగాణ

డ్రగ్స్‌ను అడ్డుకుంటే అరెస్టులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, అక్టోబర్ 27: ఎంతో గొప్ప చరిత్ర ఉన్న హైదరాబాద్ మహానగర పరువును తీస్తూ, సమాజం సిగ్గుపడేలా దుర్మార్గపు కార్యక్రమాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, సీనియర్ నాయకులు వి హనుమంతరావు మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ కుటుంబీకులు తెలంగాణా ప్రతిష్టను దెబ్బతీసే విధంగా డ్రగ్స్, వ్యభిచారాలను ప్రోత్సహించే కార్యక్రమాలకు సహకరిస్తున్నారని, తెలంగాణ ప్రజలు మీ వద్ద నుండి ఇలాంటివి కోరుకోవడం లేదని అన్నారు.
కేటీఆర్ బంధువైన రాజ్ పాకాల ఈవెంట్స్ నవ్, సెనే్సషన్ రైడ్ పేరుతో డ్రగ్స్, అమ్మాయిలతో కార్యక్రమాలను చేస్తుంటే అడ్డుకున్న ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గచ్చిబౌలిలో జరుగుతున్న ఈవెంట్‌ను అడ్డుకున్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి రామచంద్రాపురం స్టేషన్‌కు తరలించారు. వారిని కలిసేందుకు రేవంత్‌రెడ్డి, వీహెచ్ ఇతర నాయకులు వచ్చి మీడియాతో మాట్లాడారు. దేశంలో గోవా లాంటి ఎన్నో నగరాల్లో ఇలాంటి ఈవెంట్‌లను ప్రభుత్వాలు నిషేదించాయని, కానీ తెలంగాణాలో కేటీఆర్ బందువులకు కార్యక్రమ నిర్వహణకు ఎలా అనుమతులు ఇచ్చారని వారు ప్రశ్నించారు. విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఈవెంట్‌లలో యువకులు ఓవర్‌డోస్ వల్ల చనిపోతున్నారని, అయినా కేసీఆర్ ఎలా ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో మంది క్రీడాకారులను తీర్చి దిద్దేందుకు నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలో విశృంఖల కార్యక్రమాల నిర్వహణకు ఇవ్వడం దారుణమన్నారు. దుర్మార్గాలకు అడ్డాగా హైదరాబాద్‌ను మార్చి, డ్రగ్స్ ముఠాలకు ప్రభుత్వం సహకరిస్తోందని, ఈ అరాచకాలపై ప్రజలు నిలదీయాలని అన్నారు. నేరగాళ్లకు స్వర్గ్ధామంగా మారిన తెలంగాణాలో ఇటీవల డ్రగ్ రాకెట్ కేసును ఎందుకు నీరుగార్చారని వారు ప్రశ్నించారు. గచ్చిబౌలిలో జరిగే ఈవెంట్‌పై ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. సమాజాన్ని కించపరిచే దిక్కమాలిన వ్యాపారులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాడుపనులను అడ్డుకుంన్నందుకు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేయించి కేటీ ఆర్ నిరంకుశత్వాన్ని నిరూపించుకున్నాడని వెంటనే బేషరతుగా వారిని విడుదల చేయాలని అన్నారు.