తెలంగాణ

మాజీ సైనికులపై ఉత్తమ్ వరాల జల్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: మాజీ సైనికులపై టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. అధికారంలోకి రాగానే మాజీ సైనికులకు ఇళ్ళ స్థలాలు, ఐదు ఎకరాల పొలం ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాజీ సైనికులను నిర్లక్ష్యం చేసిందని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీటిని అమలు చేస్తామని ఆయన తెలిపారు. మాజీ సైనికులు ఇండ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాల్లో మాజీ సైనికులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరణించినా, గాయపడిన సైనికులకు ఆర్థిక సహాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ సైనికుల సంక్షేమాని అధిక ప్రాధాన్యతనిస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సైనికుల కాలనీలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాను 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే మిగ్-21, మిగ్-23 యుద్ధ విమానాలను నడిపించానని ఆయన చెప్పారు. నవంబర్ 1న అభ్యర్థులను ప్రకటిస్తామని, మహాకూటమి ఉమ్మడి ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తామని అన్నారు.