తెలంగాణ

కృష్ణా- పెన్నా నదుల అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: కృష్ణా , పెన్నా నదులను అనుసంధానం చేస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. ఆంధ్రా , తెలంగాణ రాష్ట్రాల్లో కుటుంబ పాలనే సాగుతోందని ఆయన విమర్శించారు.
హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో రెండు రోజుల పాటు జరిగే బీజేపీ యువమోర్చ జాతీయ సమ్మేళనం - విజయ్ లక్ష్య 2019- మహాదివేశన్ ప్రారంభ కార్యక్రమంలో శనివారం నాడు నితిన్ గడ్కారీ మాట్లాడారు. రైతులను అన్ని వర్గాలనూ అభివృద్ధి చేయడమే బీజేపీ పని అని అన్నారు. ఐటీ, బయోటెక్నాలజీలే దేశ భవిష్యత్ అని పేర్కొన్నారు. అభివృద్ధిలో నైపుణ్యాన్ని వాడుకోవల్సి ఉందని, విలువలకు జ్ఞానం, విజ్ఞానం జోడించి అభివృద్ధి వైపు మార్గం వేస్తున్నామని చెప్పారు. ఆయుర్వేద, యోగ, విజ్ఞానం కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని, పేదల అభివృద్ధి కోసం అనేక కొత్త పథకాలు మోదీ సర్కార్ తెచ్చిందని అన్నారు. వ్యవసాయ అభివృద్ధి దేశంలో జరుగుతోందని, కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు 70వేల కోట్ల సాయం చేసిందని అన్నారు. కొందరు ఇది తెలిసి కూడా బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని, రాత్రింబవళ్లు పోలవరం నిర్మాణానికి కేంద్రం కృషి చేస్తోందని అన్నారు. ఆంధ్రా, తెలంగాణ, కర్నాటక, తమిళనాడుల్లో చివరి గ్రామం వరకూ నీళ్లు అందించేలా నదుల అనుసంథానం జరుగుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా కేంద్రం సహకారాన్ని అందించిందని, వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్ , హైవే గ్రిడ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. స్మార్టు విలేజ్ అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నం విజయవంతం అవుతోందని చెప్పారు. దేశం నరేంద్రమోదీ నాయకత్వంలో పునర్నిర్మాణం జరుగుతోందని అన్నారు. సుపరిపాలన , అభివృద్ధి , జాతీయ వాదం, అంత్యోదయను బీజేపీ అన్ని రాష్ట్రాల్లో పాటిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రా , తెలంగాణ రాష్ట్రాల్లో కేవలం కుటుంబ పాలన మాత్రమే సాగుతోందని విమర్శించారు. పేదల కోసం, ప్రజల కోసం ఆలోచన చేసే విధంగా తెలంగాణ , ఆంధ్రాలో ప్రభుత్వాలు లేవని విమర్శించారు.

చిత్రం..కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ