తెలంగాణ

ప్రజలతో మమేకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: ఉన్నతాధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు, ప్రజలతో మమేకం అయి వారి అభిరుచికి తగ్గట్టు పరిపాలనలో మెలకువలను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో కేంద్ర అణుశక్తి శాఖ గ్రూప్ ‘ఏ’ అధికారులకు నిర్వహించిన వారం రోజుల మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పూర్తయిన సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని అణుఇంధన శాఖ ఈ శిక్షణాశిబిరాన్ని స్పాన్సర్ చేసింది. శిక్షణాకార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు సర్ట్ఫికెట్లను ఆచార్య అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాంకేతిక శిక్షణ ఒక్కటే అధికారులు పరిపాలనలో విజయం సాధించేందుకు సరిపోదని, ప్రజల సమస్యలను తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. యువత ఉద్యోగాల్లోకి వస్తే వారు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగిస్తారని, వారీ సీనియర్లు సాంకేతిక రంగంలో వెనుకబడిపోతారన్నారు. అందుకే సీనియర్ ఉద్యోగులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకోవాలని, కాలమాన పరస్థితులకు అనుగుణంగా సీనియర్ ఉద్యోగులు మారాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకుంటేనే ఉద్యోగాల్లో విజయం సాధిస్తారన్నారు. మహిళలకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, మహిళలు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
సైంటిఫిక్ ఆఫీసర్-ఎఫ్ రాకేశ్‌మోహన్, సైంటిఫిక్ ఆఫీసర్-జీ పి.అజయ్‌కుమార్, సైంటిఫిక్ ఆఫీసర్-ఎఫ్ జి. వసంతలక్ష్మి, అసిస్టెంట్ పర్చేస్ ఆఫీసర్ పి. రఘుకుమార్ తదితరులు మాట్లాడారు. అణు ఇంధన శాఖ అడ్మినిస్ట్రేటివ్ ఇన్‌స్టిట్యూట్ అసిస్టెంట్ డైరెక్టర్ శోభాప్రసాద్ వందనసమర్పణ చేశారు.