తెలంగాణ

ఫిరాయింపులతో టీఆర్‌ఎస్ ఖాళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఇతర పార్టీల్లోకి ఫిరాయింపుల ప్రక్రియ మొదలైయిందని, నామినేషన్ ఘట్టం చివరికి తెరాస పార్టీ ఖాళీ కావడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం నాడు ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పై విధంగా పేర్కొన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మెజార్టీ వచ్చినా కేసీఆర్ అధికార అహంకారంతో తెలంగాణలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ప్రోత్సహించి ఫిరాయింపులకు పాల్పడడం జరిగిందన్నారు. కేసీఆర్ ప్రస్తుతం అయారాం, గయారాంలతో టీఆర్‌ఎస్ బాక్స్ బద్దలయ్యిందన్నారు. అయినా కేసీఆర్ కుటుంబం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎన్నికల ప్రచారం ప్రారంభించారన్నారు. సీఎం సొంత నియోజక వర్గంలో తిరుగుబాటు మొదలయ్యిందని ఆయన గుర్తు చేశారు. ఈటల రాజేందర్, పద్మా దేవేందర్‌రెడ్డి నియోజక వర్గాల్లో ప్రజలు నిలదీస్తున్న సంఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు ఆగిపోతాయని, నీళ్ళు, కరెంట్ రాదని తప్పుడు ప్రచారం చేయడం చేస్తున్నారని అయితే వాటిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు. ప్రజాకూటమి రూపొందిచిన మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అమలు చేయడానికి ప్రణాళికను ఏర్పాటు చేస్తామన్నారు. రాబోవు ఎన్నికల్లో గడీల పాలనకు అంతం పలికి ప్రజాకూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని ఆయన భరోసా వ్యక్తం చేశారు.