తెలంగాణ

అది మాయగాళ్ల కూటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట రూరల్, అక్టోబర్ 28: దశాబ్దాలుగా నిరాదరణకు గురైన గిరిజనులకు ఆత్మగౌరవం కల్పించేలా గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని లక్ష్మీతండా, రాజ్‌నాయక్‌తండా గ్రామాల్లో ఆదివారం జరిగిన ప్రైవేటు కార్యక్రమాలకు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా తండాలకు చెందిన గిరిజనులు మంత్రికి సాదర స్వాగతం పలికి ప్రభుత్వ పథకాల ద్వారా తామంతా లబ్ధిపొందామని చెప్పడంతో మంత్రి తండా వాసులతో కలిసి రచ్చబండ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గిరిజనులు తమకు ఏఏ ప్రభుత్వ పథకాల ద్వారా ఎంతమేర లబ్ధి జరిగిందో వివరించడంతో మంత్రి సంతోషం వ్యక్తంచేశారు. మీ తండావాసులకు డిమాండ్‌లు ఏమీ లేవా? అని ప్రశ్నించగా మేము అడగకుండానే ప్రభుత్వం అన్ని కల్పించిందని చెప్పడంతో మంత్రి మురిసిపోయారు. ఈ సందర్భంగా ఆయా తండాల్లో ఆయన మాట్లాడుతూ అమాయకంగా ఉండే గిరిజనులు ఎన్నికలు వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమైక్య పాలనలో గిరిజనుల ఓట్లు పొంది గద్దెనెక్కిన నేతలు ఏనాడు గిరిజన తండాల సమస్యలు పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు తగిన ప్రాధాన్యతనిచ్చి తండాలను పంచాయతీలుగా మార్చి ఆత్మగౌరవం కల్పించడంతో పాటు తండాల అభివృద్ధికి భారీగా నిథులు కేటాయించి గిరిజన గూడలా రూపురేకలు మార్చారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రతిపక్షాలన్ని ఏకమై మయాకూటమి పేరుతో మహా మాయగాళ్లుగా వస్తున్నారన్నారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తమ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఎస్టీ, ఎస్సీ గృహాలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత తమదేనన్నారు. గిరిజనులంతా టీఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చి మరోసారి అధికారంలోకి తేస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు.