తెలంగాణ

జాతీయ నూతన విద్యా విధానంలో మహాత్మా గాంధీ విధానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: మెదడుకు సంబంధించిన జ్ఞాన వికాసానికే పరిమితం కాకుండా జాతీయ నూతన విద్యా విధానంలో మహాత్మాగాంధీ సూచించిన నయి తాలిం- మెదడు, మనస్సు, శరీరం లగ్నం కావాలనే విధానాలను చేర్చాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కోరినట్టు ఎన్‌సీఈఆర్‌టీ సభ్యుడు పి మురళీ మనోహర్ చెప్పారు. జ్ఞానం వేరు, పని అనుభవం వేరు కాదని, రెండు కలిసినపుడే సమగ్ర వికాసం సాధ్యమని గాంధీజీ నూతన విద్యాప్రణాళికను రూపొందించారని, వౌలికమైన మూల్యాధార విద్య అందరికీ ఏకరీతిన అందించాలని గాంధీజీ పేర్కొన్నారని ప్రస్తుతం దేశానికి ఈ విధానం అవసరమని ఆయన చెప్పారు. సోమవారం నాడు జేఎన్‌టీయులో జరిగిన ఒక వర్కుషాప్‌లో హాజరైన మురళీ మనోహర్ పాత్రికేయులతో మాట్లాడుతూ నయితాలిం కు అనేక నిర్వచనాలున్నాయని, దీనిని సవ్యంగా అర్ధం చేసుకోవల్సి ఉందని చెప్పారు. సాధారణ వలసవాద విధానాలను, ఆంగ్ల విధానాలను అర్ధం చేసుకున్న గాంధీజీ కొత్తగా నయి తాలిం పేరిట విద్యావిధానాన్ని ప్రతిపాదించారని, కెరీర్ ఆధారిత ఆలోచనే ఆధిపత్యం వహించే ముప్పు ఉండబోతోందని గాంధీ ముందుగానే అంచనా వేశారని, దీనివల్ల భారతీయ పిల్లలు వేరుపడినట్టు ఏకాంతంగా మారిపోతారని ఈ రుగ్మత నుండి బయటపడాలంటే గాంధీ విధానాలను అమలులోకి తేవాలని చెప్పారు. అదే విధంగా ప్రాధమిక స్థాయి నుండి డిగ్రీ- పీజీ స్థాయి వరకూ తోటి వారి పట్ల సమభావంతోనూ, గౌరవంగానూ వ్యవహరించే ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించేందుకు తగిన పాఠ్యప్రణాళికలను చేర్చాలని కూడా తాము సూచించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కస్తూరి రంగన్ కమిటీకి తాము ఈ మేరకు అభిప్రాయాలను చెప్పామని, దేశవ్యాప్తంగా అమలుకాబోతున్న నూతన విద్యా విధానంలో ఈ అంశాలను చేర్చుతారనే భావనతో ఉన్నామని అన్నారు.