తెలంగాణ

టీఆర్‌ఎస్‌తోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, అక్టోబర్ 29: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక, మొదటిసారి ఏర్పడిన తెరాస ప్రభుత్వం అన్నివర్గాలకు సమన్యాయం చేస్తూ మైనార్టీ ప్రజల అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తోందని ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం సిరిసిల్ల రాజన్న జిల్లా పరిధిలోని వేములవాడలో నియోజకవర్గ స్థాయి మైనార్టీల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మైనార్టీలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. దేశంలో మొత్తం మీద మైనార్టీలకు రూ.4వేల 700 కోట్లు బడ్డెట్ కేటాయిస్తే కేవలం తెలంగాణ ప్రభుత్వం రూ. 2వేల కోట్ల బడ్డెట్‌ను కేటాయించిందని తెలిపారు. గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనార్టీలను విస్మరించాయని, అందుకే మైనార్టీలు పూర్తిగా వెనుకబడిపోయామని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీల మేరకు 206 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించామని, ఒక్కో విద్యార్థిపై గతంలో రూ.20వేల ఖర్చుచేయగా, ప్రస్తుతం తమ ప్రభుత్వం లక్షా 35వేలను ఖర్చు చేస్తున్నామని అన్నారు. మైనార్టీల కోసం కృషి చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
టీఆర్‌ఎస్‌తోనే మైనార్టీలో మార్పు :
తెరాస అభ్యర్థి రమేశ్‌బాబు
ముస్లిం మైనార్టీల జీవితాల్లో గుణాత్మకమైన మార్పుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ అభ్యర్థి రమేశ్‌బాబు చెప్పారు. పేదరికంతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న మైనార్టీలను సంక్షేమపథకాలతో సంతోషాన్ని కేసీఆర్ నింపారని అన్నారు. పిల్లల ఉన్నత చదువుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆడపిల్లల పెళ్ళిలు భారం కాకూడదని షాదీమూబార్ పథకంలో లక్షా 116 రూపాయలు అందజేస్తూ మైనార్టీలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. సబ్‌కా సాత్.. సబ్ కా వికాస్ టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని అన్నారు. మైనార్టీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తున్న కేసీఆర్‌నూ, తననూ ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు. షాదీముబారక్ ద్వారా నియోజకవర్గ 222 మంది లబ్ధి పొందారని,వారికి రూ.1కోటి 23లక్షలను అందజేసినట్లు చెప్పారు. ముంపు గ్రామాల ముస్లింలకు ఇళ్ల స్థలాల కేటాయింపు త్వరలోనే జరుగుతుందని చెప్పారు. ఈద్గా ప్రహరీ పనులు త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రమేష్‌బాబు