తెలంగాణ

ఓటరు చేతిలో ఆయుధం సీ-విజిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 29: ఎన్నికల సమయంలో ఒకపక్క ప్రచారం చేస్తూనే.. మరోపక్క ప్రలోభాలకు గురి చేయడమనేది సర్వసాధారణంగా జరిగేదే. జాతీయ ఎన్నికల కమిషన్ నియామవళిని రూపొందించి ఎన్నికల సమయంలో అమలుచేస్తున్నప్పటికీ, అభ్యర్థుల్లో చాలామంది వాటిని ఉల్లంఘిస్తూనే ఉండటం రివాజుగా మారింది. అభ్యర్థుల్లో కొందరు వాటిని ఉల్లంఘిస్తూ, ప్రత్యర్థులు ఉల్లంఘిస్తే వాటిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేయడం, వెనువెంటనే విచారణలు జరపడం జరుగుతూనే ఉంది. అక్రమాలను అరికట్టేందుకు భారత ఎన్నికల కమిషన్ ఫ్లయంగ్ స్క్వాడ్స్, చెక్‌పోస్టులు, నిఘా బృందాలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వారి కళ్లుగప్పి యథేచ్ఛగా నియామవళి ఉల్లంఘనలు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం కొనసాగుతూనే ఉంది. వీటిని నివారించేందుకు భారత ఎన్నికల కమిషన్ ఆధునిక టెక్నాలజీని వినియోగించే చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అక్రమాలు, ఉల్లంఘనలు జరుగుతుంటే వెనువెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సీ-విజిల్ యాప్‌ను రూపొందించింది. దీనిని దేశవ్యాప్తంగా అమలుచేస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఈ యాప్‌ను వినియోగంలోకి తీసుకొచ్చారు. ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఓటరు చేతిలో ఈ యాప్ ఓ ఆయుధంగా మారనున్నది. అండ్రాయిడ్ పద్ధతిలో పనిచేసే స్మార్ట్ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ ద్వారా సీవిజిల్‌ను డౌన్‌లౌడ్ చేసుకోవాలి. ఎన్నికల నియామవళి ఉల్లంఘనలు, ఓటరును ప్రలోభాలకు గురిచేయడం తదితర అక్రమాలకు సంబంధించి ఫొటోగాని, వీడియోగాని తీసి ఫోన్‌లో జీఐఎస్ (జియోగ్రాఫిక్ సిస్టమ్)ను ఆన్‌చేసి సీవిజిల్ ద్వారా ఫిర్యాదు చేస్తే నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోగాని, జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు 24 గంటలు క్షణం క్షణం పరిశీలిస్తూ ఫిర్యాదు చేరిన వెంటనే చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తారు. సీవిజిల్ యాప్ జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల కంట్రోల్‌రూం, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, పర్యవేక్షించే సిబ్బందికి, ప్లయింగ్ స్క్వాడ్‌కు అనుసంధానమై ఉంటాయి. జీఐఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదును పరిశీలించి ఏ ప్రాంతంనుంచి ఫిర్యాదు వచ్చిందో ఆ ప్రాంతాన్ని గుర్తించి సమీపంలో ఉన్న ప్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని అక్కడికి 10 నుంచి 15 నిమిషాల్లో అక్కడికి చేరుకొని ఫిర్యాదుకు సంబంధించిన వాటిని పరిశీలించి వెనువెంటనే సంబంధిత ఫిర్యాదుకు సంబంధించిన చర్యలు చేపట్టి నివేదికను ఇవ్వడం జరుగుతుంది. ఫిర్యాదుదారుని వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఒకవేళ ఫిర్యాదుదారుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ నెంబరుకు ఎస్‌ఎంఎస్ ద్వారా తీసుకున్న చర్యల వివరాలను తెలియచేస్తారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, విలువైన బహుమతులను అందచేసినా, డబ్బులు, చీరలు, మద్యం పంపిణీ చేసినా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, అనుమతి లేకుండా బడి, గుడి, ప్రభుత్వ ప్రాంగణాలలో సమావేశాలు నిర్వహించినా, ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తున్నట్లు సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్ ద్వారా ఎన్నికల ఉల్లంఘనలను కొంతమేరనైనా అరికట్టవచ్చనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ దీనిని తీసుకొచ్చింది. ఆచరణలో ఈ యాప్ ఎంతమేర సత్ఫలితాలిస్తుందో వేచి చూడాలి.