తెలంగాణ

దిద్దుబాటు మొదలైంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణలోని సీమాంద్ర ప్రజలకు తాను అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వైపు మొగ్గుచూపిన హైదరాబాద్‌లోని సీమాంద్ర ఓటర్లు, ప్రస్తుతం వారు టీఆర్‌ఎస్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నట్టు తాజా మాజీ సెటిలర్ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. టీఆర్‌ఎస్ పట్ల సీమాంద్ర ప్రజలకు ఏర్పడిన అపోహలను తొలగించడానికి ‘మన హైదరాబాద్-మన అందరి హైదరాబాద్’ పేరిట నిజాంపేటలో మంత్రి కేటీఆర్ సమావేశం పెట్టి తాను వ్యక్తిగతంగా అండగా నిలుస్తానని హామీ ఇవ్వడానికి కారణంగా చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేసేస్థాయిలో ఉన్న సీమాంధ్ర ఓటర్లకు భరోసా కల్పించడం ద్వారా దిద్దుబాటు చర్యలకు టీఆర్‌ఎస్ పూనుకొంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల నిజామాబాద్, నల్లగొండలో నిర్వహించిన ఎన్నికల సభల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ వ్యాఖ్యల వల్ల హైదరాబాద్‌తో పాటు రాష్టవ్య్రాప్తంగా ఉన్న సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సెటిలర్ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. పార్టీ మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా ఇదే అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తూ, తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్ర ప్రజలంతా తెలంగాణ బిడ్డలేనని, తాము ఇంకా పరాయివాళ్లమన్న భావనను విడనాడలని పిలుపునిచ్చారు.
అయితే దీనితో సంతృప్తి చెందని సెటిలర్ ఎమ్మెల్యేలు మరింత స్పష్టత ఇస్తే తప్ప ఈసారి ఎన్నికల్లో సీమాంధ్ర ఓటర్లు టీఆర్‌ఎస్‌కు ఓటు వేసే పరిస్థితి లేదని గగ్గోలు పడిన తర్వాతనే ప్రత్యేకంగా నిజాంపేటలో కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎన్నో చేసుకుంటాం, వాటిని రాజకీయ నేతల మధ్య జరిగినట్టుగా భావించాలి తప్ప ఒక ప్రాంత ప్రజలను ఉద్దేశించి చేసినట్టుగా భావించవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ ఇచ్చిన భరోసాతో సంతృప్తి చెందని సెటిలర్ ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ చెబితే బాగుంటుందని తాజాగా టీఆర్‌ఎస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో సీమాంధ్ర ప్రజల ఓట్ల కోసమే కేటీఆర్ భరోసా ఇచ్చారు తప్పితే, గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎలా మరిచిపోతారని కాంగ్రెస్ నేతలు మరింత ఆజ్యం పోసేలా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌తో జత కట్టిన టీడీపీ, కూటమి తరఫున ప్రచారానికి చంద్రబాబు నాయుడు రానున్నారు. చంద్రబాబు నాయుడు ప్రచారానికి వచ్చేలోగా సీమాంధ్ర ఓటర్లను మచ్చిక చేసుకునేలా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ భావిస్తున్నట్టు తెలిసింది. సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ సభలను పెట్టించేలా సెటిలర్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ అధిష్టానంపై వత్తిడి తెస్తోన్నట్టు సమాచారం. సొంత పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యేల వత్తిడిపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.