తెలంగాణ

ఎల్బీనగర్ నుంచే పోటీ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: ఎన్నికల సందర్భంగా ప్రజలకు మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్న రాజకీయ పార్టీలు, నేతలపై చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులైన గుజ్జకృష్ణ, వేముల రామకృష్ణ, అంజి, రావులకోలు నరేష్, బర్క కృష్ణ, రాజ్‌కుమార్, రాములు, కోట్ల శ్రీనివాస్ తదితరులతో కలిసి కృష్ణయ్య సోమవారం చీఫ్ ఎలక్టోరల్ అధికారి డాక్టర్ రజత్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, ఆ యా పార్టీల నేతలు గత వారం రోజుల నుండి గ్రామాల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం బాటిళ్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. పోలింగ్ డిసెంబర్ 7 న జరుగుతున్నప్పటికీ, రాజకీయ పార్టీలు కోట్లాది రూపాయలను వెదజల్లుతున్నాయని ఆరోపించారు. ఒక్కో అభ్యర్థి 20 కోట్ల రూపాయల నుండి 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. గ్రామాల్లో కులపెద్దలకు, గ్రామపెద్దలకు, యువజన సంఘాలకు లక్ష రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు ఇచ్చేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని తెలిపారు. కొద్ది మొత్తం అడ్వాన్సుగా కూడా ఇచ్చినట్టు ఫిర్యాదులు వచ్చాయన్నారు. మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తుండటంతో పేద ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటోందని వివరించారు. రజత్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చిన తర్వాత కృష్ణయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ధనప్రవాహం, మద్యం ప్రవాహం తగ్గించేందుకు పౌరసమాజం, మేధావులు, సంఘ సంస్కర్తలు, విద్యావంతులు ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. తాను ఎల్‌బీ నగర్ నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని కృష్ణయ్య స్పష్టం చేశారు.