తెలంగాణ

క్రైస్తవుల సమస్యలపై కమిటీ వేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: క్రైస్తవులపై టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. డిసెంబర్ 12న రాష్ట్రంలో ఏసు క్రీస్తు కోరుకున్న ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైయ్యేంత వరకు తాను నిద్ర పోనని, మిమ్మల్లి నిద్ర పోనివ్వనని అన్నారు. అఖిల భారత క్రిస్టియన్ ఫెడరేషన్ సోమవారం సికింద్రాబాద్ వైఎంసీఏలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉత్తమ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ముందస్తు ఎన్నికలతో రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతున్నదన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీల్లో కలిపే విషయంలో పార్లమెంటులో బిల్లు పెట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే క్రైస్తవుల సమస్యలు తెలుసుకోవడానికి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతన కమిటీని నియమించి నివేదిక తెప్పించుకుని, పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. చర్చిల నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని, చర్చిలు, దేవాలయాలు, మసీదులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయిస్తామని, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో క్రైస్తవులకు, దళిత క్రైస్తవులకు ప్రాధాన్యతనిస్తామన్నారు. పూజారులకు, వౌజంలకు వేతనాలు చెల్లిస్తున్నట్లే ఫాస్టర్లకూ చెల్లిస్తామన్నారు. వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామన్నారు. ఫాస్టర్లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని, దాడులు జరగవని, పూర్తి భద్రత తమదేనని ఉత్తమ్ తెలిపారు.
అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, అపద్ధర్మ మంత్రి కే. తారక రామారావు ఢిల్లీకి వెళ్ళి బీజేపీతో ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. కాబట్టి టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకే వేసినట్లు అవుతుందని ఆయన హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ ఏజెంట్ అని విమర్శించారు. ఇంకా ఈ సమావేశంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఫాస్టర్ విజయరాజు తదితరులు ప్రసంగించారు.
పోలీసు వాహనంలో గజమాల!?
ఇలాఉండగా ఉత్తమ్‌కుమార్‌ను ఘనంగా సన్మానించేందుకు నిర్వాహకులు గజమాల సిద్ధం చేయించారు. ఆ గజ మాలను పోలీసు వాహనంలో తీసుకుని రావడంతో, అక్కడే ఉన్న కొంత మంది తీవ్ర అభ్యంతరం చెప్పారు. దీంతో వివాదం ఎందుకని గజమాలను సభ జరుగుతున్న హాలులోకి తీసుకుని రాలేదు, ఉత్తమ్‌కు వేయలేదు. పోలీసులు అప్పుడే ప్లేటు ఫిరాయించారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
చిత్రం..సికింద్రాబాద్ వైఎంసీఏలో అఖిల భారత క్రిస్టియన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్