తెలంగాణ

రోడ్డుపై బైఠాయంచి మోత్కుపల్లి ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* స్పృహతప్పిన నర్సింహులను అరెస్టుచేసి తరలించిన పోలీసులు * భగ్గుమన్న దళిత సంఘాలు
యాదగిరిగుట్ట రూరల్, అక్టోబర్ 30: ఆలేరు అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని మల్లాపురం గ్రామంలో ఇంటింటాప్రచారం నిర్వహిస్తుంటే డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్ బైక్ ర్యాలీతో ప్రదర్శన నిర్వహించి అనుచరులు తనపట్ల అమర్యాదగా ప్రవర్తించటమే కాకుండా తన ప్రచార రథాన్ని కారుతో ఢీకొట్టి తనను చంపాలని కుట్ర పన్నారని ఆరోపిస్తూ మోత్కుపల్లి నర్సింహులు మంగళవారం రోడ్డుపై బైటాఋంచి ధర్నా నిర్వహించారు. భిక్షమయ్యగౌడ్ వెంటనే అరెస్ట్ చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడు గంటల సేపు ఆయన రోడ్డుపై బైటాయించడంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని భిక్షమయ్యగౌడ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం చేటు చేసుకుంది. పోలీసులు ఎంత సర్దిచెప్పి నప్పటికీ మోత్కుపల్లి రోడ్డుపైనుంచి లేవకపోవడంతో ఏసీపీ మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి బాగులేదని అరెస్ట్‌చేసి తుర్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మోత్కుపల్లి అరెస్ట్‌కు నిరసనగా ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. మల్లాపురంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మెత్కుపల్లి నర్సింహులు విలేఖరులతో మాట్లాడుతూ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత అవమానాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. సామరస్య పూర్వక వాతావరణంలో దళిత నాయకుడనైన తాను ఇంటింటా ప్రచారం నిర్వహిస్తుండగా బూడిద బిక్షమయ్యగౌడ్ ధన బలంతో బైక్ ర్యాలీ నిర్వహించాడని వారి ప్రచారం వారు చేసుకుంటే తనకు అభ్యంతరం లేదు కానీ అనవసరంగా తనను అవమానపరిచి తన ప్రచార రథం చుట్టూ బైక్‌లను తిప్పుతూ అగౌర పరిచారని ఏకంగా తన ప్రచార రథానే్న కారుతో ఢీకొట్టి తనను చంపాలని చూశారని అందుకే రోడ్డుపై బైటాయించానని అన్నారు. బూడిద బిక్షమయ్యగౌడ్‌ను అరెస్ట్ చేసి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు తెలిపినా పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. బూడిద భిక్షమయ్యగౌడ్ 250 ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుని భూ కబ్జాలకు పాల్పడ్డాడని, అతడిపై ఎన్నో కేసులున్నాయని అతడిది నేర చరిత్ర అని అందుకే అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బూడిద బిక్షమయ్యగౌడ్ తనకు పోటీనే కాదని ఓడి పోతాననే భయంతోనే తనపై కుట్ర పన్నారని అన్నారు. సొమ్మసిల్లి పడిపోయిన నర్సింహ్మలు ఆరోగ్య పరిస్థితి బాగులేదని, అందుకే అరెస్ట్ చేయడం జరిగిందని ఏసీపీ తెలిపారు. ఈ ధర్నాకు టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మద్దత్తు తెలిపారు. మల్లాపురం గ్రామంలోని ప్రజలు మద్దత్తు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీ ఎస్ రాష్ట్ర నాయకులు మంద శంకర్, మండల నాయకలు సురేందర్,దళిత నాయకులు బాల్‌నర్సయ్య,బీఎల్‌ఎఫ్ నాయకలు పోశెట్టి, నాయకులు దడిగే ఇస్తారి, కైరంకొండ శ్రీదేవి పాల్గొన్నారు.