తెలంగాణ

రాష్ట్రాన్ని నాశనం చేసింది మీరే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేటటౌన్, అక్టోబర్ 31: తెలంగాణ ప్రాంతాన్ని నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించి తెలంగాణ వెనుకబాటుకు కారణమైన కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తెలంగాణ ద్రోహిలా చరిత్రలో నిలిచిపోయారన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో జరిగిన ముస్లింల సదస్సులో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తరువాత 2004వ సంవత్సరం వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక్కసారి కూడా ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదని, గతంలో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా నాలుగుశాతం రిజర్వేషన్లు ఇప్పించడంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పాత్ర ఎంతో ఉందన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామన్నారు. పార్లమెంట్‌లో రిజర్వేషన్ల కోసం టీఆర్‌ఎస్ పోరాటం చేస్తే దానికి కాంగ్రెస్ సహకరించలేని విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియలు రాష్ట్రాల పరిధిలోకి తీసుకువచ్చేందుకు టీఆర్‌ఎస్ ఎంతగానో కృషి చేస్తోందన్నారు.
ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించి రిజర్వేషన్ల అధికారాలను రాష్ట్రాలకు పరిమితం చేసేలా కేంద్రంపై వత్తిడి తీసుకురానున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలంగాణలో కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఎమ్మెల్యేగా కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌తో మాట్లాడి రాష్ట్రంలో ముస్లింలు నిరుపేదలుగా ఉన్నారని వారి సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విన్నవించగా అప్పట్లో 80లక్షల నిధులతో మైనార్టీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ముస్లింలను ఐఏఎస్, ఐపీఎస్‌లుగా చూడాలన్న తపన సీఎం కేసీఆర్‌లో ఉందని అందులో భాగంగానే మైనార్టీల విద్యాభివృద్ధికి కేసీఆర్ ఎన్నో పథకాలను చేపడుతూ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను నడిపిస్తున్నారన్నారు.
‘పేట’లో సైనిక్‌స్కూల్: ఎంపీ జితేందర్ రెడ్డి
నారాయణపేట పట్టణ శివారులో యాభై ఎకరాల విస్తీర్ణంలో సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఇందుకు కేంద్ర అనుమతి లభించిందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేటలో జరిగిన ముస్లిం సదస్సులో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మైనార్టీల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. అలాగే, నారాయణపేట నియోజకవర్గ అభివృద్ధి స్వాతంత్రం లభించిన తరువాత ఏనాడూ జరగలేదని, ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకులు తమ స్వప్రయోజనాల కోసమే పని చేశారని, కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నారాయణపేట నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతోందని నారాయణపేట మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేటలో జరిగిన ముస్లిం సదస్సులో ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలోనే ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. తాను టీడీపీ నుంచి గెలుపొంది అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరానని చెప్పానని, అయితే, అభివృద్ధిని చేతల్లో చూపిస్తున్నారని అన్నారు.