తెలంగాణ

ఏసీబీ వలలో ఎస్‌ఐ, సర్వేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, అక్టోబర్ 31: కేసు మాఫీ చేస్తానని బాధితుడి నుంచి 10వేలు లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా ధర్మపురి ఎస్‌ఐ అంజయ్య ఏసీబీకి దొరికిపోయారు. తన పోలీస్ స్టేషన్‌లోనే బుధవారం సాయంత్రం ఇది చోటుచేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన అల్లంకొండ చంద్రయ్య కరీంనగర్‌కు చెందిన మహేంద్ర ఫైనాన్స్‌లో రుణ సాయం ద్వారా ట్రాక్టర్ తీసుకున్నారు. చెల్లించాల్సిన డబ్బులు తిరిగి చెల్లించని స్థితిలో ఫైనాన్స్‌వారు ట్రాక్టర్‌ను స్వాధీన పరుచుకున్నారు. ఆ ట్రాక్టర్‌ను పెగడపెల్లి మండలం ఎల్లాపూర్‌కు చెందిన పెద్ది శ్రీరాములు 2018 మార్చి 30నాడు ఓపెన్ ఆక్షన్ ద్వారా కొనుగోలు చేశారు. అయితే, కొనుగోలు చేసిన ట్రాక్టర్‌పై ఇసుక అక్రమ రవాణా కేసు ఉందని, గత సెప్టెంబర్ 29న వాజీద్ అనే ఏఎస్‌ఐని శ్రీరాములు వద్దకు ఎస్‌ఐ అంజయ్య పంపగా, అక్టోబర్ 3న శ్రీరాములు ధర్మపురి ఎస్‌ఐ అంజయ్యను వచ్చి కలిశాడు. కొనుగోలు చేసిన ట్రాక్టర్‌పై కేసు ఉందని, ట్రాక్టర్‌ను స్టేషన్‌కు స్వాధీన పరచాలని లేనిచో క్రిమినల్‌కేసు నమోదు చేస్తామని చెప్పారు. తాను ట్రాక్టర్‌ను స్క్రాప్ కింద సెప్టెంబర్ 10నే విక్రయించానని బాధితుడు తెలిపాడు. అయనా 19న పిలిపించి, 50వేల ఇస్తే, వాహనం తేనవసరం లేకుండా కేసు మాఫీ చేస్తానని ఎస్‌ఐ చెప్పారు. అంత ఇచ్చుకోలేనన్న శ్రీరాములు చివరకు 20వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత శ్రీరాములు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం ధర్మపురి స్టేషన్‌లో ఎస్‌ఐకి 10వేలు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ ఎం.కిరణ్ కుమార్ నేతృత్వంలో బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. సొమ్ము స్వాధీనం చేసుకున్న తరువాత ఎస్‌ఐను వెంట తీసుకెళ్ళారు. ఏసీబీ ఇన్స్‌పెక్టర్లు వేణుగోపాల్, సంజీవ్, సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎస్‌ఐను గురువారం కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరుస్తామని వివరించారు.

చిక్కిన ఉండవల్లి సర్వేయర్
మానవపాడు : పొలం సర్వే చేసేందుకు లంచం తీసుకుంటూ సర్వేయర్ పట్టుబడ్డ సంఘటన బుధవారం ఉండవెల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శ్రీక్రిష్ణగౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కంచుపాడు గ్రామానికి చెందిన పెద్దవెంకటరెడ్డి, చిన్నవెంకటరెడ్డి, సత్యారెడ్డిలకు తమ తండ్రి ఆస్తి సర్వే నంబర్ 129లో 7.11 గుంటల పొలం ఉంది. పొలాన్ని పెద్ద వెంకటరెడ్డికి 2.18 గుంటలు, చిన్న వెంకటరెడ్డికి 2.17 గుంటలు, సత్యారెడ్డికి 2.17 గుంటల ఆస్తి సంక్రమించింది. సత్యారెడ్డి కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా తనకు సంక్రమించిన 2.17గుంటను ఏడాది క్రితం విక్రయించాడు. విక్రేతకు తన పొలం సరిహద్దులు చూయించేందుకు గత నెల 18న సర్వేకై తహశీల్దార్ సూచన మేరకు మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. సర్వేకై సత్యారెడ్డి సర్వేయర్ చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. చివరకు ఈ నెల 2న సర్వేయర్ రూ.7వేలు లంచం ఇవ్వాలని కోరారు. సత్యారెడ్డి రూ.6వేలు ఇస్తానని సర్వేయర్ హరిక్రిష్ణతో అంగీకారం కుదుర్చుకున్నారు.
సర్వేయర్ హరికృష్ణ్ణ లంచం అడిగిన విషయాన్ని ఏసీబీ డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. పొరుగు రాష్టమ్రైన కర్నూలు పట్టణంలోని వెంకటరమణకాలనీలో ఒప్పంద లంచం నగదు ఇవ్వాలని సర్వేయర్ సూచించారు. కాగా కర్నూలులో కాదు కార్యాలయం దగ్గర ఇవ్వాలని సర్వేయర్ సత్యారెడ్డికి తెలిపారు. అందులో భాగంగా బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏసీబీ డీఎస్పీ సూచనల మేరకు కాపు కాచారు. కార్యాలయానికి వచ్చిన సర్వేయర్ సర్వే రిపోర్టును సత్యారెడ్డికి అందించి సదరు లంచం నగదు కారులోని వెనుక సీటులో ఉంచాలని సూచించాడు. సత్యారెడ్డి ఏసీబీ కేటాయించిన రూ.5వేలను కారులో ఉంచగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.