తెలంగాణ

జాతీయ రాజకీయాల్లో.. టీఆర్‌ఎస్ క్రీయాశీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, అక్టోబర్ 31: ఎన్ని కూటమిలు వచ్చినా టీఆర్‌ఎస్ పార్టీదే విజయమని.. వచ్చే ఎన్నికల్లో వంద స్థానాలు కైవసం చేసుకుంటామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. బుధవారం రాత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వందమంది మంత్రి హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ క్రీయాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వనరులను, హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ స్థాయిలోనే టీఆర్‌ఎస్ బలమైన పార్టీగా ఆవిర్భవించిందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకీ ప్రజలే హైకమాండ్ అన్నారు. 40 ఏళ్ల్లలో జరగని అభివృద్ధిని టీఆర్‌ఎస్ నాలుగేళ్లలో చేసి చూపిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
సిద్దిపేట సీటు వద్దంటున్న మహాకూటమి నేతలు
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మహాకూటమి నేతలు సీట్ల కోసం పట్టుబడుతుండగా.. సిద్దిపేట అసెంబ్లీ సీటు మాత్రం తమకు కేటాయించవద్దని మహాకూటమిలోని అన్ని పార్టీల నేతలు కోరుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో ప్రత్యర్థులు పోటీచేసేందుకు భయపడుతున్నారన్నారు. సిద్దిపేట నియోజక వర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. సిద్దిపేట ఉద్యమంలో ముందుందని, అభివృద్ధిలో నెంబర్‌వన్‌గా ఉందని, వచ్చే ఎన్నికల్లో మెజార్టీలో సైతం ముందుండాలని ఆకాంక్షించారు. సిద్దిపేట గౌరవం, ప్రతిష్టను పెంచేలా పనిచేసానన్నారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి నాయకులు, కార్యకర్తలు చేరటం వల్ల తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. సిద్దిపేట అభివృద్ధిలో విద్య, వైద్యరంగాలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేటకు త్వరలో గోదావరి నీరు, రైలు, జాతీయ రహదారులు, పరిశ్రమలు వస్తాయన్నారు. విద్యుత్, నీరు, రవాణ వ్యవస్థ మెరుగ్గా వుంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు. సిద్దిపేటను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, నిరుద్యోగ సమస్యను నివారిస్తానన్నారు. సిద్దిపేటు మెడికల్ కళాశాలకు మంజూరు చేసుకుంటే కరీంనగర్‌కు చెందిన పొన్నం ప్రభాకర్, సంగారెడ్డికి చెందిన జగ్గారెడ్డి వ్యతిరేకించారన్నారు.
సిద్దిపేట కాంగ్రెస్ నేతలు నోరు మూసుకున్నారని, మెడికల్ కళాశాల సిద్దిపేటు వద్దా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు సిద్దిపేటలో ఓటు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ సిద్దిపేటలో నమోదు చేసి గౌరవాన్ని పెంచాలన్నారు.