తెలంగాణ

రైల్ నిలయంలో ఐక్యతా పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: భారతదేశ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురష్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఐక్యతా పరుగు కార్యక్రమాన్ని దక్షణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో అలుపెరగని పోరాట యోదుడుగా సర్దార్ వల్లబాయ్ పటేల్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఐక్యతా పరుగులో అదనపు జనరల్ మేనేజర్ జాన్ థామస్, ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీరు అర్జున్ ముండియా, ప్రిన్సిపల్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్ మధుసూదనరావు, వీఎం శ్రీవాస్తవ్, ఏఏ ఫడ్కే, టీజే ప్రకాశ్, ప్రధాన సెక్యూరిటీ కమిషనర్ జీఎమ్ ఈశ్వర్‌రావుపాల్గొన్నారు. అలాగే దక్షణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో ఐక్యతా పరుగు కార్యక్రమాలు జరిగాయని సంబంధిత సీపీఆర్‌ఓ ఉమాశంకర్ తెలిపారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో
దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌తో పాటు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ డిస్కమ్ కార్యాలయంలో
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో విద్యుత్ డిస్కమ్ కార్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
విద్యుత్ డిస్కమ్ సీఎండీ రఘుమారెడ్డితో పాటు సంస్థ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌కో, జెన్కో కార్యాలయాల్లో జరిగిన కార్యాక్రమాల్లో ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
సింగరేణిలో...
సింగరేణిలో బుధవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నిర్వహించారు. సింగరేణి జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ఉక్కు మనిషిగా పేరుగాంచిన పటేల్ స్వాతంత్య్ర ఉద్యమకాలంలో ప్రజలందర్నీ ఒకే తాటిపైకి తెచ్చారని అన్నారు.