తెలంగాణ

రాజనీతిజ్ఞుడు పటేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్దార్ పటేల్ స్ఫూర్తిని నీరుగారుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి వేడుకలను బీజేపీ తెలంగాణ శాఖ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర ఉన్న పటేల్ విగ్రహానికి ఆయన పూల మాలలు సమర్పించారు. జాతీయ ప్రధానకార్యదర్శి పి మురళీధరరావు, ఎంపీ బండారు దత్తాత్రేయ, జీ కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, బద్దం బాల్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పూలమాలలు సమర్పించారు. గత ప్రభుత్వాలతో పాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజాకర్ల వారసత్వంతో పుట్టిన ఎంఐఎం అడుగులకు మడుగులు ఒత్తి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజల పోరాటాలను, త్యాగాలను ఈ ప్రభుత్వాలు అవమాన పరుస్తున్నాయని దుయ్యబట్టారు. పటేల్ లేకుంటే తెలంగాణ ఉండేది కాదని, నేడు టీఆర్‌ఎస్ పార్టీ కూడా ఉండేది కాదని అన్నారు. ముఖ్యమంత్రి నాటి పోరాట యోధులను, సర్దార్ పటేల్‌ను గౌరవించి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి కారణమైన వారిని మరచి ఈ ప్రభుత్వం సర్దార్ పటేల్ స్ఫూర్తిని నీరుగార్చిందని అన్నారు. ప్రపంచం పటేల్ ఖ్యాతిని గుర్తించేలా 182 మీటర్ల ఎత్తయిన సర్దార్ విగ్రహాన్ని గుజరాత్ నర్మదా నది తీరాన ఆవిష్కరించిందని చెప్పారు. నెహ్రూ కుటుంబాన్ని తప్ప దేశంలో ఉన్న నాయకులు అందర్నీ కాంగ్రెస్ విస్మరించిందని, మాజీ ప్రధాని పీవీ నర్సింహరావును అవమానించిందని పేర్కొన్నారు.
ఉక్కు మనిషి వల్లభాయ్: దత్తాత్రేయ
సర్దార్ పటేల్ రాజనీతిజ్ఞుడని బండారు దత్తాత్రేయ కొనియాడారు. ఆనాడు పటేల్ సంస్థానాల సమస్యలను పరిష్కరించి ఉండకపోతే నేడు మనం నివసిస్తున్న సమైక్య భారత్ ఉండేది కాదని అన్నారు. ముక్కలు ముక్కలుగా ఉన్న దేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ అని అన్నారు. నేడు పటేల్ విగ్రహావిష్కరణతో అనేక మంది స్వాతంత్య్ర సమర యోధుల గాధలు ప్రజలకు తెలిశాయని అన్నారు.

తెలంగాణ కోరలేదు: నరహరి
తెలంగాణ ప్రభుత్వం ఏనాడూ కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదని బీజేపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ చైర్మన్ నరహరి వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. 2014లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరుతో 11వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేశారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు పేరుమీద పనులు ప్రారంభించారని చెప్పారు.
సీడబ్ల్యుసీ , ఫారెస్టు , టెక్నికల్, గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణం వంటి అనుమతులు పొందకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైందని అన్నారు. ప్రపంచ బ్యాంకు నుండి రుణం తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కడతామని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు.

సీఎం రిలీఫ్ ఫండ్‌లో అవినీతి: కృష్ణసాగరరావు
కేసీఆర్ పాలనలో సీఎం రిలీఫ్ ఫండ్‌లో అవినీతి జరిగిందని బీజేపీ అధికార ప్రతినిధి కే కృష్ణసాగరరావు ఆరోపించారు. 2015-16లో 86.05 కోట్లు లబ్దిదారులకు ఇచ్చినట్టు చూపగా, అందులో 98.5 శాతం ఎవరికి ఇచ్చారో అధికారికంగా చూపెట్టడం లేదని అన్నారు.