బిజినెస్

రూపాయికి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: రూపాయి మారకపు విలువ క్రమంగా పుంజుకుంటున్నది. డాలర్‌తో మారకపు విలువ గురువారం 50 పైసలు పెరిగి, 73.45 రూపాయలకు చేరింది. గత నెల 25న 73.27గా ఉన్న రూపాయి మారకపు విలువ నెల చివరి రోజు, బుధవారం అత్యల్పంగా 73.95 రూపాయలకు పడిపోయింది. అయితే, గురువారం కొంత వరకూ తేరుకుంది. ఫోరెక్స్ ట్రేడింగ్ రూపాయికి అనుకూలంగా మారడం దేశీయ మదుపరులకు ఊతమిస్తున్నది. ఇటీవల కాలంలో విదేశీ పెట్టుబడిదారులు భారీగా తమ వాటాలను అమ్ముతున్న నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్ కుప్పకూలకుండా ఉండడానికి దేశీయ మదుపరులకే కారణమన్నది వాస్తవం. విదేశీయులు అమ్ముతున్న వాటాల్లో ఎక్కువ శాతాన్ని దేశీయ మధ్యతరగతి పెట్టుబడి సంస్థలు, వ్యక్తులు సొంతం చేసుకోవడం గమనార్హం. రూపాయి మారకపు విలువ పెరగడంతో విదేశీ పెట్టుబడిదారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచిచూడాలి.