బిజినెస్

పసిడి మరింత ప్రియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పండుగల సీజన్ కొనసాగుతుండడంతో దేశంలో పసిడి ధర కూడా పెరుగుతోంది. బులియన్ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల బంగారం ధర రూ. 130 పెరిగి, రూ. 32,780కి చేరుకున్నది. పండుగల సీజన్ డిమాండ్‌ను తట్టుకునేందుకు స్థానిక నగల వ్యాపారులు నిరాటంకంగా కొనుగోళ్లు జరపడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు పటిష్ట స్థాయిలో ఉండటం వల్ల గురువారం దేశీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. అయితే, వెండి ధర మాత్రం పడిపోయింది. పారిశ్రామిక యూనిట్ల నుంచి కొనుగోళ్లు తగ్గడం వల్ల బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర గురువారం మరో రూ. 90 తగ్గి, రూ. 39,110కి చేరింది. పవిత్రమయిన ‘దంతేరాస్’, దీపావళి పండుగలు సమీపిస్తున్నందున స్థానిక ఆభరణాల వ్యాపారులు ఎడతెరిపి లేకుండా కొనుగోళ్లు జరపడంతో పాటు ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం వల్ల దేశంలో బంగారం ధరలు పెరిగాయని వ్యాపారులు చెప్పారు. ప్రపంచ మార్కెట్లను పరిశీలిస్తే, సింగపూర్‌లో పసిడి ధర 0.82 శాతం పెరిగి, ఒక ఔన్స్‌కు 1,225.10 డాలర్లకు చేరుకుంది. వెండి ధర కూడా 1.16 శాతం పెరిగి, ఒక ఔన్స్‌కు 14.48 డాలర్లకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 130 పెరిగి, రూ. 32,780కి చేరుకుంది. అలాగే, 99.5 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర కూడా రూ. 130 పెరిగి, రూ. 32,630కి చేరుకుంది. బంగారం ధర క్రితం రెండు రోజుల్లో కలిసి పది గ్రాములకు రూ. వంద పెరిగింది. అయితే, సావరిన్ గోల్డ్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఎనిమిది గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ. 24,900 వద్ద కొనసాగింది.