తెలంగాణ

ప్రశాంత ఎన్నికలకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, నవంబర్ 1: రాష్ట్రంలో డిసెంబర్‌లో జరుగబోయే సాధారణ ఎన్నికలను మహాయజ్ఞంలా తీసుకున్నాం... ఏ మాత్రం అల్లర్లకు, అసాంఘిక కార్యక్రమాలకు అవకాశమివ్వం... ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ జరిగేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలంతా స్వేచ్ఛగా... శాంతియుతంగా ఓట్లు వేసే అవకాశాన్ని కల్పించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ ఇందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గురువారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మిలినీయం హాల్‌లో రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా పరిధిలోని పోలీసు అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి భద్రతపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మన రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం అంతగా లేదని... అయినా నక్సల్స్‌తో ఎలాంటి ముప్పు ఎదురవ్వకుండా పూర్తిగా కట్టుదిట్టం చేశామని అన్నారు. కమీషనరేట్ పరిధిలోని పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లోని నక్సల్స్ నుంచి ఎలాంటి ముప్పు ఎదురు కాకుండా ఎక్కడిక్కడ చర్యలు చేపట్టామని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికల నిర్వహణకు ఎప్పుడైనా... రాష్ట్రంలో ఎక్కడైనా మావోయిస్టుల నుంచి సమస్య ఉత్పన్నం కాకుండా నక్సల్స్ కదలికలపై ప్రత్యేక గ్రేహౌండ్స్ బలగాలతో నిఘాను పెంచామని అన్నారు. చీమ చిట్టుక్కుమన్న తెలిసే విధంగా రాష్ట్రంలో భద్రతా వ్యూహం సిద్ధం చేశామని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అన్ని నియోజక వర్గాల ప్రాంతాల్లోని గ్రామాల్లో భద్రత కోసం పారామిలటరీ బలగాలను రంగంలోకి దించనున్నామని, అదేవిధంగా పక్క రాష్ట్రాలకు చెందిన పోలీస్ బలగాలను కూడా ఎన్నికల నిర్వహణకు వినియోగించుకుంటామని వివరించారు. అసాంఘిక కార్యక్రమాలకు ఏ మాత్రం అవకాశం లేకుండా రామగుండం కమీషనరేట్ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, పోలీసుల పని తీరు చాలా బాగుందని డీజీపీ కితాబిచ్చారు. సజావుగా ఎన్నికలు జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని మహేందర్ రెడ్డి కోరారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ ముందుకు సాగాలంటే అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రెవెన్యూ శాఖ ఎంతో సహకారంగా ఉంటుందని డీజీపీ పేర్కొన్నారు. ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి భద్రతా చర్యలు, ప్రత్యేక వసతులు, సౌకర్యాలు, రవాణా, మ్యాన్ పవర్ తదితర అంశాలపై ఎన్టీపీసీలో జరిగిన సమీక్ష సమావేశంలో పోలీస్ అధికారులతో రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, గ్రేహౌండ్స్ ఐజీ శ్రీనివాస్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, డీఐజిలు ప్రభాకర్ రావు, ప్రమోద్ కుమార్, రామగుండం సీపీ వి.సత్యనారాయణ, డీసీపీలు సుదర్శన్ గౌడ్, వేణుగోపాల్ రావు, రెండు జిల్లాల ఏసీపీలు, సిఐలు, ఎస్ ఐలు పాల్గొన్నారు.