బిజినెస్

లిక్విడేషన్‌కు212 సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 3: ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద సెప్టెంబర్ చివరి నాటికి సుమారు 212 సంస్థలు లిక్విడేషన్‌కు వెళ్లాయని ఓ ఉన్నతాధికారి శనివారం ఇక్కడ తెలిపారు. 1,198 కార్పొరేట్ కంపెనీల రెజల్యూషన్ ప్రక్రియకు అంగీకరించగా, అందులో 52 సంస్థలు విజయవంతంగా పరిష్కారమయ్యాయని ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) హోల్-టైమ్ మెంబర్ సవ్‌రంగ్ సాయిని తెలిపారు. ‘చాలా ఇన్‌సాల్వెన్సీ కేసులు గతంలో ఉన్న బీఐఎఫ్‌ఆర్ (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్సియల్ రీకన్‌స్ట్రక్షన్) నుంచి వచ్చాయి. అందుకే లిక్విడేషన్‌కు వెళ్లిన కంపెనీల సంఖ్య ఎక్కువగా ఉంది’ అని ఇక్కడ మర్చంట్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో నిర్వహించిన ఒక ఇంటరాక్టివ్ కార్యక్రమంలో మాట్లాడుతూ సాయిని వెల్లడించారు. ఇన్‌సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ కింద రికవరీ 50శాతం- వంద శాతం మధ్య ఉందని ఆయన చెప్పారు. నేషనల్ కంపనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) బెంచ్‌లు ఇప్పటి వరకు ప్రిఫెరెన్షియల్, మోసాలు, తక్కువ వెలకట్టిన సంఘటనలకు సంబంధించి 192 కేసులను విచారణకు స్వీకరించాయని ఐబీబీఐ మరో అధికారి తెలిపారు.