బిజినెస్

29న చిత్ర కళాకారిణి అమృత షేర్ గిల్స్ కళాఖండం అమ్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రముఖ పెయింటర్ అమృత షేర్ గిల్‌కు చెందిన పెయింటింగ్ ది లిటిల్ గర్ల్ ఇన్ బ్లూను ఈ నెల 17వ తేదీన బికనీర్ హౌస్‌లో ఆ తర్వాత ముంబయిలోని తాజ్‌మహల్ ప్యాలెస్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఆ తర్వాత నవంబర్ 29వ తేదీన ఈ పెయింటింగ్‌ను విక్రయించనున్నారు. ఎనిమిది దశాబ్ధాల క్రితం 1934లో అమృత షేర్ గిల్ ఈ కళా ఖండాన్ని రూపొందించారు. ఈ పెయింటింగ్‌ను అవిభక్త భారతదేశంలో లాహోర్‌లో వేశారు. వేలంలో ఈ పెయింటింగ్ రూ. 10 నుంచి రూ.15 కోట్ల దాకా అమ్ముడవుతుందని అంచనా. షేర్ గిల్ తన 21వ ఏట ఈ పెయింటింగ్‌ను వేశారు. ఈ పెయింటింగ్ చిత్ర కళలో ఏ స్కూల్‌కు సంబంధించినది కాకపోవడం విశేషం. 80 ఏళ్లుగా షేర్‌గిల్ కుటుంబంలోనే ఈ పెయింటింగ్ ఉందని పెయింటింగ్ ప్రదర్శన నిర్వాహకులు చెప్పారు. భారతీయ చిత్రకళలో అమృత షేర్‌గిల్ ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రకళ ప్రదర్శనను సోతేబైస్ ఇండియా ఎండీ గౌరవ్ భాటియా నిర్వహిస్తున్నారు.