రాష్ట్రీయం

అభ్యర్థులకు రక్షణ కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న అభ్యర్థులు, పార్టీల నాయకులపై దాడి చేసేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నట్టు తమకు సమాచారం అందిందని చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) రజత్ కుమార్ వెల్లడించారు.
గురువారం సాయంత్రం సచివాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ అభ్యర్థులకు, పార్టీ నేతలకు భద్రత కల్పించేందుకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేసిందన్నారు. చత్తీస్‌గఢ్‌లో ఉన్న విధంగా మావోయిస్టుల ప్రాబల్యం తెలంగాణలో లేదన్నారు. కాగా నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని సీఈఓ తెలిపారు. నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల నియమావళి గురించి అభ్యర్థులు, పార్టీల నేతలు తెలుసుకోవాలని సూచించారు. నియమావళికి అనుగుణంగా లేని నామినేన్లను తిరస్కరిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తున్నామని, ఈ నెల 17 నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో తనిఖీ చేస్తామన్నారు. అభ్యర్థులు 10 వేల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తే చెక్కుల రూపంలో చెల్లించాలని సూచించారు. తాజా సమాచారం ప్రకారం ఓటర్ల సంఖ్య 2,77,28,226 కు పెరిగిందన్నారు. ఇప్పటి వరకు 70 కోట్ల రూపాయల నగదు, 6.66 కోట్ల రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సి-విజిల్‌కు ఇప్పటి వరకు 2614 ఫిర్యాదులు వచ్చాయని, 1950 హెల్ప్‌లైన్‌కు 78,272 ఫోన్‌కాల్స్ వచ్చాయన్నారు. మంత్రులు, టీఆర్‌ఎస్ అభ్యర్థులకు కూడా నోటీసులు జారీ చేశామన్నారు. కొంత మంది ఇప్పటికే సమాధానం ఇచ్చారని, మరికొంత మంది వివరణ ఇవ్వలేదన్నారు.
టీడీపీకి సైకిల్..
టీడీపీ రాష్ట్రంలో గుర్తింపు కలిగిన పార్టీ అని, ఈ పార్టీ అభ్యర్థులకు సైకిల్ గుర్తు ఇస్తామన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి వేరొక గుర్తు ఇస్తామని స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్లకు ఆన్‌లైన్‌లో బహుమతులు పంపిణీ చేస్తున్న విషయం తనదృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరిపి, తగిన చర్య తీసుకుంటామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి సంబంధించిన ఖర్చును లెక్కించేందుకు థర్డ్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తన కార్యాలయంలో 60 మందిని, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాల్లో 600 మందిని ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించుకున్నామన్నారు.
సంగారెడ్డి కలెక్టర్‌పై ఫిర్యాదు అందలేదు
సంగారెడ్డి కలెక్టర్‌పై తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఈఓ స్పష్టం చేశారు. సంగారెడ్డి కలెక్టర్‌పై విపక్షాలు ఫిర్యాదు చేశాయన్న విషయం తనకు తెలియదన్నారు. స్మితా సబర్వాల్‌పై మాజీ ఎంపీ మధుయాష్కీ ఫిర్యాదు చేసిన విషయం తన దృష్టికి రాలేదన్నారు.