ఆంధ్రప్రదేశ్‌

సమ్మిళిత అభివృద్ధితో అసమానతల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధిని సాధించి ప్రాంతాల మధ్య అసమానతల తొలగింపే లక్ష్యంగా ముందుకెళుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు తెలిపారు. 13 జిల్లాల్లో ఏడు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయని, మిగిలిన వాటితో వీటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రానున్న 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ఉత్తమ మూడు రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అభివృద్ధిలో ప్రథమ రాష్ట్రంగా, 2050 నాటికి ఉత్తమ ప్రపంచ గమ్యస్థానంగా నిలుపాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అంశంపై బుధవారం శాసనసభలో 344వ నిబంధన కింద సభ్యులు బి.కె.పార్థసారథి, బి.వి.జయనాగేశ్వర్‌రెడ్డి, వీరాంజనేయస్వామి, బగ్గు రమణమూర్తి, కె.అప్పలనాయుడు, కదిరి బాబూరావు ఇచ్చిన నోటీసుపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మండలాన్ని యూనిట్‌గా చేసుకుని ఏడు జిల్లాల్లో ఉన్న వెనుకబాటు తనాన్ని గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు గాను కొన్ని అభివృద్ధి సూచికలను ప్రామాణికంగా గుర్తిస్తామని వెల్లడించారు. అన్ని ప్రాంతాలలో సమ్మిత అభివృద్ధిని సాధించడానికి కేంద్రీకృత విధానాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు, రాయలసీమలో జిల్లాల్లో ఉన్న వెనుకబాటు తనాన్ని రూపుమాపేందుకు గాను ప్రతిష్టాత్మకంగా చేపట్టే రెండు పారిశ్రామిక కారిడార్లతో అభివృద్ధికి బాటలు వేస్తామని అన్నారు. విభజన చట్టంలోని 46(3) విభాగంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి ప్యాకేజీ కింద రూ.24,350 కోట్ల సమగ్ర ప్రతిపాదనను కేంద్రప్రభుత్వ ప్రణాళిక సంఘం నీతి ఆయోగ్‌కు సమర్పించినట్లు తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రెండు వాయిదాల్లో ఒక్కోదానికి రూ.100 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు రూ.700 కోట్లు ఇప్పటి వరకు విడుదలైనట్లు చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత పారిశ్రామిక అనివృద్ధికి విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు, జాతీయ పెట్టుబడితయారీ జోన్లు వంటి ప్రాజెక్టులను తీసకురానున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రాధాన్యతలను పక్కన పెట్టి ఇష్టానుసారంగా ప్రారంభించి, అసంపూర్తిగా వదిలివేసిన సాగునీటి ప్రాజెక్టులను తాము ప్రాధాన్యత క్రమంలో గుర్తించి పూర్తి చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నట్లు సిఎం చెప్పారు. తమ స్పష్టమైన విజన్ ద్వారా రాష్ట్రం రెండంకెల వృద్ధిని సాధించడానికి కృషి చేస్తోందని వెల్లడించారు.

ఉచితంగానే ఇసుక
ఏపి సిఎం వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 30: శాశ్వతంగానే ఇసుకను ఉచితంగా అందిస్తామని ఎపి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు బుధవారం నాడు శాసనసభలో స్పష్టం చేశారు. ఉచితంగా ఇసుక నెల రోజుల పాటే ఇస్తారని కొంత మంది ప్రచారం చేస్తున్నారని, అది నిజం కాదని, శాశ్వతంగానే ఇసుకను ఉచితంగా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఎపి అసెంబ్లీలో ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఉచిత ఇసుక అంశంపై వాడీ వేడీ చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2వేల కోట్ల రూపాయిల మేర ఇసుక కుంభకోణం జరిగిందని స్వయాన ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారని, ఆ కుంభకోణంలో ఎవరిని అరెస్టు చేశారో, ఆ కుంభకోణం ఏమైందో చెప్పాలని పట్టుపట్టారు. రెండేళ్లపాటు ఇసుకను దోచుకున్నారని జగన్ ఆరోపించారు. జగన్ ఆరోపణలను రాష్ట్ర గనుల మంత్రి పీతల సుజాత ఖండించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దందాలను ఇకనైనా ఆపండి, లేకపోతే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిని ప్రతిపక్ష సభ్యులు సైతం పట్టుకోవచ్చని అన్నారు. ఉచిత ఇసుక విధానంలో సలహాలు సూచనలు ఇస్తే వాటిని కూడా పరిశీలిస్తామని అన్నారు. ఇసుకను వ్యాపారమయం చేస్తే మాత్రం పిడి యాక్టు కింద కేసులు నమోదుచేస్తామని పేర్కొన్నారు.శాసనసభలో వైకాపా సభ్యులు తీరుపై సిఎం మండిపడ్డారు. ఇసుక ఫిర్యాదులను టోల్ ఫ్రీ నెంబర్ 18005994599కు ఫోన్ చేసి చెప్పవచ్చని అన్నారు. పట్ట్భాముల్లో సైతం ఇసుకను అమ్మడానికి వీల్లేదని అన్నారు. ఇసుకకు డబ్బులు అడిగితే తిరగబడాలని, అలా తిరగబడిన వారిపై కేసులు కూడా పెట్టబోమని ప్రజలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు.