ఆంధ్రప్రదేశ్‌

ఎన్టీఆర్ ఇళ్లపై కేంద్రం స్కానింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 16: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ పేరుతో నిర్మిస్తున్న ఇళ్లను కేంద్రం ప్రభుత్వం స్కానింగ్ చేస్తోంది. రాష్ట్రంలోని 110 పురపాలక సంఘాల్లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్-పంచాయితీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీ- పీఆర్) ద్వారా సామాజిక తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో వారే స్వయంగా లబ్ధిదారులుగా ఎంపికైన వారిచ్చిన చిరునామాలకు వెళ్ళి ఆరా తీస్తున్నారు. దీనిపై ఒక నివేదిక తయారుచేశారు. ఈ నివేదిక ఆధారంగా ఎన్‌ఐఆర్‌డీ-పీఆర్ ఆయా పురపాలక సంఘాల్లోని కమిషనర్లను సమన్వయ పర్చుకుని లబ్ధిదారులతో సమావేశాలను ఏర్పాటుచేసుకంటున్నారు. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన ద్వారా ఆయా రాష్ట్రాలకు ఇళ్ళు ప్రకటించిన నేపధ్యంలో ధరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఏ విధంగ అర్హత పొంది బ్యాంకు రుణాలను వెళ్తున్నారు, వీటిలో ఏదైన తప్పిదాలు జరిగాయా, ఇంకా ఏ విధమైన సహాయం చెయ్యగలం అనే విషయాలను లబ్ధిదారులతొ చర్చిస్తున్నారు. అయితే ఈ తనిఖీల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లు చాలామందికి బినామీలుగా ఉన్నారని వెలుగులోకి వస్తోంది. దీనిపై బృందం కూపీలాగుతోంది. అయితే సామాజిక తనిఖీల్లో పరిశీలిస్తే దరఖాస్తుదారులు ఇచ్చిన చిరునామాల్లో ఎవరూ ఉండకపోవడం, ఒకే వార్డులో చాలామంది దరఖాస్తుదారులకు కౌన్సిలర్ల ఫోన్ నెంబర్లే లింక్ అయ్యి ఉండటం కనిపించింది. దీంతో చాలామంది లబ్ధిదారులుగా గుర్తింపు పొందినవారు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల బినామీలుగా భావిస్తున్నట్టు సమాచారం.
ఇళ్లు ఉన్న వాళ్లకే మరో ఇల్లు పీఎంఎవైలో మంజూరుచేశారు. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇందిరమ్మ కాలనీల పేరుతో పెద్ద ఎత్తున భూమిని కొనుగోలుచేసి, అక్కడ పేదలకు ఇళ్లు నిర్మించారు. ఆవిధంగా లబ్ధిపొందిన వారికి మరోమారు హౌసింగ్ ఫర్ ఆల్‌లో ఇళ్లు మంజూరుచేసినట్టు వెలుగుచూస్తోంది. వీరంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారుగా గుర్తించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇచ్చిన రేషన్ కార్డుల్లోని ఇద్దరికీ ఇళ్లు ఇవ్వడం జరిగింది. ఇటువంటి వాటిని ఎన్‌ఐఆర్‌డీ-పీఆర్ గుర్తించింది. వీటన్నింటినీ తొలగించాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను ఆదేశిస్తున్నారు.
ఇదిలావుండగా కేంద్రం ఇళ్లు ప్రకటించిన సమయంలో ధరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మృతి చెందడం, మరి కొందరు ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్ళడం తదితర కారణాలు అటు రాష్ట్రప్రభుత్వాన్ని మరో పక్క బ్యాంకర్లను వేధిస్తున్నాయని చెప్పవచ్చు.