బిజినెస్

అరవింద్ లిమిటెడ్ నికర లాభం రూ.75.08 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: అరవింద్ లిమిటెడ్ సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో 16.38 శాతం వృద్ధి రేటుతో రూ. 75.08 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. వస్త్రాలు తయారు చేసే ఈ కంపెనీ 2017 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 64.51 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అరవింద్ లిమిటెడ్ గురువారం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)కి సమర్పించిన ఒక పత్రంలో ఈ వివరాలు వెల్లడించింది. 2018 సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 1,815.98 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ. 1,609.10 కోట్ల ఆదాయంతో పోలిస్తే ఇది 12.85 శాతం ఎక్కువ. 2018 సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ మొత్తం వ్యయం రూ. 1,723.27 కోట్లు. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో చేసిన మొత్తం వ్యయం రూ. 1,540.08 కోట్లతో పోలిస్తే ఇది 11.89 శాతం ఎక్కువ.